ఓపీయ‌స్‌, ఈపీయ‌స్ వ‌ర్గాల క‌ల‌యిక ఇవాళ్లేనా!

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇంకా హైడ్రామా కొన‌సాగుతూనే ఉంది. ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి వ‌ర్గం, మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వమ్ వ‌ర్గాల క‌ల‌యిక లాంఛ‌న ప్రాయ‌మే అంటున్నారు. గ‌త కొద్దిరోజుగా ఎడ‌తెర‌పి లేకుండా జ‌రుగుతున్న చ‌ర్చ‌లు ఓ కొలీక్కి వ‌చ్చిన‌ట్టు చెబుతున్నారు. నిజానికి, గ‌తవారంలోనే ఈ విలీన ప్ర‌క్రియ పూర్త‌వుతుంద‌ని అనుకున్నారు. చెన్నైలోని మెరీనా సాగ‌ర‌తీరంలో ఉన్న అమ్మ జ‌య‌ల‌లిత స‌మాధిని కూడా అలంక‌రించేశారు. కానీ, చివ‌రి నిమిషంలో విలీనానికి మ‌రింత స‌మ‌యం తీసుకుంటామంటూ ఇరు వ‌ర్గాలు వెన‌క్కి త‌గ్గాయి. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్యా ప‌దవుల పంప‌కాల‌పైనే జీడిపాకం చ‌ర్చ‌లు కొన‌సాగుతూ వ‌చ్చాయి. ప్ర‌స్తుతానికి ఓ క్లారిటీ వ‌చ్చేసింద‌నీ, సోమ‌వారం నాడు మంచి ముహూర్తం ఉంద‌నీ, రెండు వ‌ర్గాలూ అమ్మ సమాధి సాక్షిగా ఒక‌టైపోతాయ‌ని త‌మిళ‌నాడులో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

రెండు వ‌ర్గాల మ‌ధ్యా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవ‌ని మాజీ ముఖ్య‌మంత్రి ప‌ళని స్వామి ప్ర‌క‌టించారు. దీంతో సోమ‌వారం నాడు అధికారికంగా ఏదో ఒక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్టు క‌నిపిస్తున్నాయి. ఇక‌, ప‌ద‌వుల విష‌యానికి వ‌స్తే.. ప‌న్నీరుకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌బోతున్నారు. దీంతోపాటు ప్ర‌జా ప‌న్నుల శాఖ కావాల‌ని కూడా ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నార‌ట‌. ఈ డిమాండ్ల‌కు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని అంగీక‌రించార‌ని స‌మాచారం. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి విష‌యంలో మొద‌ట్నుంచీ ప‌న్నీరు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. అయితే, ముఖ్య‌మంత్రి విన్న‌పం మేర‌కు ఆయ‌న ఓ మెట్టు దిగార‌నీ, ఆ విష‌య‌మై విలీనం త‌రువాత మాట్లాడుకుందామ‌ని ఒప్పించినట్టు చెబుతున్నారు. వ‌ర్గాల విలీనంతోపాటు ఎన్డీయేలో క‌ల‌యిక విష‌య‌మై కూడా ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం నాడు భాజ‌పా జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చెన్నై రాబోతున్నారు. దీంతో ఆ లాంఛ‌నం కూడా పూర్త‌యిపోతుంద‌ని అంటున్నారు.

విలీన ప్ర‌క్రియ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో చిన్న‌మ్మ వ‌ర్గంలో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని స‌మాచారం. దిన‌క‌ర‌న్ వ‌ర్గంలో నిన్న‌టి వ‌ర‌కూ 19 మంది శాస‌న స‌భ్యులు ఉండేవారు. వారితో ఇటీవలే బ‌ల ప్ర‌ద‌ర్శ‌న ర్యాలీ కూడా నిర్వ‌హించారు. అయితే, ఈ రెండు వ‌ర్గాల క‌ల‌యిక నేప‌థ్యంలో ఆ ఎమ్మెల్యేల సంఖ్య ప్ర‌స్తుతం మూడుకు ప‌డిపోయింద‌ని తెలుస్తోంది. పార్టీలో త‌న ఆధిప‌త్యం త‌గ్గుతోంద‌నీ, దీన్ని గాడిలో పెట్టాలంటే శ‌త్రుసంహార యాగం చేయాల‌ని శ‌శిక‌ళ సూచించింద‌ట‌! శివ‌గంగ జిల్లాలోని పెరుమాళ్ల ఆల‌యంలో ఈ యాగం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ యాగం పూర్త‌యితే పార్టీపై ప‌ట్టు దిన‌క‌ర‌న్ కు వ‌స్తుంద‌ని ఆయ‌న న‌మ్మ‌కం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close