‘తాండ‌వ్‌’పై.. హిందూ సెగ‌

సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లూ `మ‌నో భావాల‌`ను గ‌ట్టిగా దెబ్బ తీయ‌డం మొద‌లెట్టాయి. తాజాగా.. `తాండ‌వ్‌` పై ఓ వ‌ర్గం క‌న్నెర్ర చేస్తోంది. ఈనెల‌ 15న అమెజాన్ ప్రైమ్ లో తాండవ్ వెబ్ సిరీస్ విడుద‌లైంది. తొలి రోజే.. వివాదాలు మొద‌లైపోయాయి. సైఫ్ అలీఖాన్, డింపుల్‌ కపాడియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ వెబ్ సిరీస్ కి అలీ అబ్బాస్‌ జాఫర్ ద‌ర్శ‌కుడు.

ఈ వెబ్ సిరీస్‌లో హిందూ దేవుళ్ల పై కొన్ని సెటైర్లు ప‌డ్డాయి. అదే.. ఇప్పుడు వివాదాల‌కు హాట్ స్పాట్ గా మారింది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్‌ సిరీస్‌ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్‌ ముంబయిలోని ఘట్కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భాజపా ఎంపీ మనోజ్‌కుమార్‌ కొటక్ కూడా ఈ విష‌యంలో‌ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావదేకర్‌కు లేఖ రాశారు. ఈ వెబ్ సిరీస్ ని త‌క్ష‌ణం నిలిపి వేయాల‌ని, లేదంటే.. ఆందోళ‌న‌ని తీవ్రత‌రం చేస్తామంటూ హెచ్చ‌రిస్తున్నారాయ‌న‌. ఈ నేప‌థ్యంలో ముందస్తు జాగ్రత్తగా ముంబయి శివారులో ఉన్న సైఫ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. `ఓ మై గాడ్‌`, `పీకే` సినిమాల విడుద‌ల స‌మ‌యంలోనూ.. స‌రిగ్గా ఇలాంటి విమ‌ర్శ‌లే వినిపించాయి. అవి ఆయా చిత్రాల‌కు ప‌బ్లిసిటీ కి బాగా ఉప‌యోగ‌ప‌డ్డాయి. తాండ‌వ్ కీ అంతేనేమో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close