ఇక‌ ‘టాక్సీవాలా’ని వ‌దిలేస్తారా..?

బాక్సాఫీసు ద‌గ్గ‌ర విజ‌య్ దేవ‌ర‌కొండ స్టామినా ఏంటో.. ‘గీత గోవిందం’తో మ‌రోసారి తెలిసొచ్చింది. తొలి రోజు వ‌సూళ్ల వ‌ర్షం కురిసింది. ఓ అగ్ర క‌థానాయ‌కుడితో స‌మానంగా తొలిరోజు వ‌సూళ్లు ద‌క్కాయి. విజ‌య్ సినిమా అంటే క‌ల‌క్ష‌న్ల‌కు ఢోకా ఉండ‌ద‌న్న విష‌యం ‘గీత గోవిందం’తో అర్థ‌మైపోయింది. `టాక్సీవాలా`కి కావ‌ల్సింది ఇలాంటి స్ఫూర్తే. `గీత గోవిందం` కంటే ముందే విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. కానీ… ఏవేవో కార‌ణాలు చెబుతూ వాయిదా వేస్తూ వ‌చ్చారు. విఎఫ్ఎక్స్ స‌రిగా కుద‌ర‌లేద‌ని, అందుకే ఆల‌స్య‌మైంద‌ని నిర్మాత చెబుతున్నారు. అయితే.. దాంతో పాటు ఈ సినిమాకి బ‌జ్ లేక‌పోవ‌డం కూడా ఓ ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఎందుక‌నో.. ‘టాక్సీవాలా’ జ‌నాల్లోకి చొచ్చుకెళ్ల‌లేక‌పోయింది. విజ‌య్ త‌ప్ప‌.. మ‌రో అట్రాక్ష‌న్ లేక‌పోవ‌డం ఈ చిత్రానికి ఓ ప్ర‌ధాన స‌మస్య‌. నిర్మాత‌లు కూడా ‘గీత గోవిందం’ హిట్ట‌యితే క్రేజ్ పెరుగుద్ది క‌దా అని ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల ఆశ‌లు, అంచ‌నాలు ఫ‌లించాయి. ‘గీత గోవిందం’ సూప‌ర్ హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమా చూపించి ‘టాక్సీవాలా’ ని మంచి రేట్ల‌కు అమ్ముకునే ఛాన్సుంది. సో… ఒక‌ట్రెండు రోజుల్లో ‘టాక్సీవాలా’ రిలీజ్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close