అసెంబ్లీ సీట్లు ఖరారు చేసుకుంటున్న టీ బీజేపీ ముఖ్య నేతలు!

తెలంగాణ బీజేపీ ఇప్పుడు జోష్ మీద ఉంది. ఎంపీలుగా గెలిచిన వాళ్లు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకే పోటీచేయాలని పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికిప్పుడు వారు తమ కోరికల్ని వినూత్నంగా బయట పెడుతున్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్.. తాను ఆర్మూర్ నుంచి పోటీ చేస్తానని సవాల్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై పోటీ చేస్తానని ఇప్పటికే బహిరంగంగానే అర్వింద్ప్రకటించారు. ఆర్మూర్ నియోజవర్గంలోటీఆర్ఎస్ నేతలు తమను అడ్డుకున్న విషయాన్ని చాలా పకడ్బందీగా వాడుకున్నారని బీజేపీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పుడు పోటీ చేసినా ఓడిపోతున్నారు. కరీంనగర్ అసెంబ్లీకి పోటీ చేసి డిపాజిట్ కూడా కోల్పోయిన తర్వాత ఎంపీగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుంచి కాకుండా వేములవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల్లో వేములవాడ నుంచే అత్యధిక ఓట్లు వచ్చాయి. వేములవాడ నుంచి పోటీ చేస్తే సునాయాసంగా గెలవచ్చనే భావనలోసంజయ్ ఉన్నారు. అందుకే అక్కడ తరచూ పర్యటిస్తున్నారు.

కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డి చూపు అసెంబ్లీపైనే ఉంది. వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కిషన్ రెడ్డి గత ముందస్తు ఎన్నిల్లో మాత్రం పరాజయం పాలయ్యారు. ఆ వెంటనే ఎంపీగా గెలిచారు. ఈ సారి అంబర్పేటలో మళ్లీ పోటీ చేయడం ఖాయమే. ఆదిలాబాద్ఎంపీ సోయం బాపూరావు కూడా ఆసిఫాబాద్ ఏరియాల్లో ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచే బరిలోకి దిగాలనే యోచనలో ఆయన ఉన్నారు. ఢిల్లీ స్థాయి నేతలు అసెంబ్లీకి గురి పెడుతూండటంతో ఇక రాష్ట్ర నేతలు మాత్రం ఊరుకుంటారా..? ఎవరి నియోజకవర్గాలకు వాళ్లు కర్చీఫ్‌లు వేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close