ఇదో క్రిడ్‌ ప్రో కో అనుకోవాలా?

స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రతిష్టకూ ఇంకా చెప్పాలంటే అస్తిత్వానికి సంబంధించిన ఓటుకు నోటుకేసులో తెలంగాణ ప్రభుత్వ అనాసక్తి ఎప్పుడో స్పష్టమై పోయింది. ఈ కారణంగానే ఏడాది గడిచిన అడుగు పడలేదు. మరోవైపున ముత్తయ్య కేసులో హైకోర్టు తీర్పుతో అసలు కేసుకు ఠికాణా లేకుండా పోయిందని రేవంత్‌ రెడ్డి శిబిరం గట్టిగానే ప్రచారం చేసింది. ఈ పరిస్థితుల్లో వైసీపీ ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎసిబి కోర్టులో కేసు దాఖలు చేసి ఎట్టకేలకు కదలిక తీసుకొచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయవలసిందిగా కోర్టు ఆదేశించింది. ఆ దశలో చంద్రబాబు నాయుడు హైకోర్టుకు వెళ్లి ఆ ఆదేశంపై 8 వారాల స్టే తెచ్చుకున్నారు. దీనిపై మళ్లీ ఆర్కే సుప్రీం కోర్టుకు వెళ్లారు. వాస్తవానికి అది అవసరం లేని వ్యవహారం అని నేనప్పుడే వ్యాఖ్యానించాను. ఏమంటే హైకోర్టు పరిధిలో వున్న వ్యవహారాల్లో తక్షణ ప్రభావం వుంటే తప్ప సుప్రీంకోర్టు సామాన్యంగా జోక్యం చేసుకోదు. జగన్‌పై కేసుల సందర్భంలోనూ పలుసార్లు సుప్రీం ఇలాగే వ్యవహరించడం తెలిసిందే. ఇప్పుడు కూడా ఆర్కే పిటిషన్‌పై జోక్యానికి మొదట నిరాకరించింది.దానిపై మరింత విన్నవించిన తర్వాత వాదనలు విన్నది. ఆ తర్వాత కూడా జోక్యానికి నిరాకరించినా హైకోర్టును నాలుగు వారాల్లోగా తేల్చవలసిందిగా ఆదేశించింది. ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి గనక ఒక వారం గడువు తగ్గించినట్టు చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇదేదో వైసీపీకి చెంపపెట్టు అనడానికి లేదు. రాజకీయ ఉద్దేశాలతో కేసు వేశారని వ్యాఖ్యానించడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఆర్కే ప్రతిపక్ష వైసీపీ ఎంఎల్‌ఎగా వున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఒక్క ముక్క పట్టుకుని వైసీపీకి ఏదో దెబ్బ తగిలినట్టు టిడిపి మిత్రులు కొందరు సోషల్‌ మీడియాలో పోస్టింగులు చేయడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టు చంద్రబాబుకు అనుకూలంగా మాట్టాడింది లేకపోగా నాలుగు వారాల్లో కేసు తేల్చాలని హైకోర్టును ఆదేశించడం వ్యతిరేక పరిణామంగానే భావించకతప్పదు. ఒక వేళ అలా జరక్కుండా ఆలస్యం చేసేట్టయితే మళ్లీ మా దగ్గరికి రండి అని కూడా అవకాశమివ్వడం గమనార్హం.ఇంతకూ అసలు సూత్రధారులైన తెలంగాణ ఏసిబి వారు, మొదట్లో అత్యుత్సాహం చూపిన పరిపాలకులూ ఇప్పుడెందుకు ఉదాసీనంగా వుంటున్నారో అర్థం కాదు. ఇదో క్రిడ్‌ ప్రో కో అనుకోవాలా? సుప్రీం కోర్టు తాజా ఆదేశం వైసీపీకి గాని, టిడిపికి గాని విజయమని చెప్పడానికి లేదు. కాకపోతే ఉభయులూ అవతలివారికి చెంపపెట్టు అని ప్రచారం చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close