పొత్తులుండని ప్రకటనలు చేస్తున్న టీడీపీ – వ్యూహాత్మకమా ?

పొత్తులపై టీడీపీ నేతల ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఇటీవలి వరకూ చంద్రబాబుతో సహా అందరూ జనసేన పార్టీ కలిసి రావాలని పిలుపునిచ్చేవారు. అందరం కలిసి ప్రభుత్వంపై పోరాడదామనేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఒకరి తర్వాత ఒకరు ఒంటరి పోటీ అనే సంకేతాలు పంపుతున్నారు. పొత్తుల్లేకుండానే గెలుస్తామని చెబుతున్నారు. ఇలాంటి నేతల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. పొత్తులపై పార్టీ పెద్దల అనుమతి లేకుండా మాట్లాడే అవకాశం ఉండదు. వారి సూచనలతోనే ఇలా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ప్రజలు ప్రభుత్వాన్ని మార్చాలని నిర్ణయించుకుంటే.. ఎన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసినా మ్యాండేట్ ఏకపక్షంగా వస్తుందని ఇటీవలి ఎన్నికలు నిరూపిస్తున్నాయి. పంజాబ్ ఎన్నికలనే ఉదాహరణకు తీసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు ప్రజలు. ప్రత్యామ్నాయంగా ఆప్‌ను ఎంచుకున్నారు. దళిత నేతను సీఎంగా ఉంచినా వర్కవుట్ కాలేదు. అలాంటి పరిస్థితుల్లో .. పొత్తులు పెట్టుకోవడం కూడా అనవసర ప్రయాసేనన్న వాదన టీడీపీలో వినిపిస్తోంది.

పైగా పొత్తులు పెట్టుకుంటే.. వారి కోసం పార్టీని కొంత త్యాగం చేయాలి. సీట్లు కేటాయించాలి. అంతకు మించి.. టీడీపీ గురించి వారు మాట్లాడే మాటలను భరించాలి. గతంలో అనుభవాలు అలాగే ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు. టీడీపీ వల్ల బీజేపీ జాతీయ స్థాయిలో బలపడిందనేది నిజమని .. కేంద్రంలో బీజేపీ తొలి ప్రభుత్వం టీడీపీ వల్లనే ఏర్పడినా తమ వల్ల నష్టపోయామని ప్రచారం చేస్తూంటారని.. గత నాలుగేళ్లుగా వారెంతో బలపడ్డారో తెలుస్తోంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే వ్యవహారం ఇతర పార్టీలతోనూ వర్తిస్తుందని అంటున్నారు. ప్రజలు కావాలనుకుంటే టీడీపీని ప్రత్యామ్నాయంగా చూస్తారని లేకపోతే లేదని అంత మాత్రం దానికే పొత్తలంటూ హడావుడి పడటం దేనికని కొంత మంది టీడీపీ సీనియర్లు బహిరంగంగానే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close