సోము లేదా పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షులయినట్లయితే?

త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షు కంబంపాటి హరిబాబు పదవీ కాలం ముగియబోతోంది. ఆ పదవి కోసం సోము వీర్రాజు, పురందేశ్వరి పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోము వీర్రాజు మొదటి నుంచి బీజేపీలోనే ఉండటం ఆయనకి కలిసి వచ్చే అంశమయితే, మాజీ కేంద్ర మంత్రిగా మంచిపేరు, పలుకుబడి కలిగి ఉండటం పురందేశ్వరికి కలిసివచ్చే అంశం. వారిరువురిలో ఎవరో ఒకరు లేకపోతే మళ్ళీ హరిబాబే బీజేపీ అధ్యక్షుడు కావచ్చును. అది ఆ పార్టీ అంతర్గత వ్యహారం. కానీ ఆ ప్రభావం మిత్రపక్షమయిన తెదేపా మీద, దానితో బీజేపీ సంబంధాల మీద తప్పకుండా పడుతుందని చెప్పవచ్చును. ఒకవేళ మళ్ళీ హరిబాబే అధ్యక్షుడయితే ప్రస్తుతం ఆ రెండు పార్టీల మధ్య ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అవే మున్ముందు కూడా కొనసాగవచ్చును. కానీ తెదేపాను తీవ్రంగా వ్యతిరేకించే సోము వీర్రాజు, పురందేశ్వరిలలో ఎవరయినా బీజేపీ అధ్యక్షులయినట్లయితే ఆ రెండు పార్టీల మధ్య బంధం ఎంతో కాలం కొనసాగకపోవచ్చును.

చంద్రబాబు నాయుడితో పురందేశ్వరికి ఉన్న విభేదాలు, ఆ కారణంగా వారిరువురి మధ్య నెలకొన్న శత్రుత్వం గురించి అందరికీ తెలుసు. అలాగే ఆమె సార్వత్రిక ఎన్నికలలో విశాఖపట్నం నుంచి పోటీ చేద్దామనుకొంటే, ఆమెకు ఆ సీటు దక్కకుండా చేసి ఆమెకు బొత్తిగా బలం, అవగాహన లేని రాజంపేట నియోజక వర్గం నుండి పోటీ చేయవలసిన దుస్థితి కల్పించి, ఆమె ఓటమికి పరోక్షంగా కారకులయిన వారెవరో అందరికీ తెలుసు. విశాఖ నుండి ఆమె పోటీ చేసి మళ్ళీ గెలిచి ఉండి ఉంటే ఆమె రాజకీయ జీవితం చాలా ఉజ్వలంగా ఉండేది. కానీ తెర వెనుక జరిగిన రాజకీయాల వలన ఆమె తీవ్రంగా నష్టపోయింది. అయినా ఆమె తన స్వయంశక్తితో, ప్రతిభతో మళ్ళీ పైకి ఎదగగలిగారు. ఈ నేపధ్యంలో ఒకవేళ ఆమె ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలుగా నియమితులయితే తెదేపాతో సంబంధాలు ఏవిధంగా ఉండబోతాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.

ఇక సోము వీర్రాజు కూడా తెదేపా ప్రభుత్వాన్ని, తెదేపా నేతలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తెదేపా తమ పార్టీ మరియు కేంద్రప్రభుత్వం పట్ల తన వైఖరి మార్చుకోకపోయినట్లయితే, తెదేపాతో సంబంధాలు తెంచుకోవడానికి కూడా వెనుకాడబోమని సోము వీర్రాజు కొన్ని రోజుల క్రితం హెచ్చరించారు. చంద్రబాబు నాయుడుని, తెదేపా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కావూరి సాంభశివరావు, కన్నా లక్ష్మి నారాయణ వంటి నేతలు కూడా ఇప్పుడు ఆయనకి తోడయ్యారు. కనుక ఒకవేళ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయితే తెదేపాతో సంబంధాలు ఏవిధంగా ఉండబోతాయో కూడా ఊహించవచ్చును.
వీరిరువురిలో ఎవరు అధ్యక్షులయినప్పటికీ తెదేపాతో వారికున్న శత్రుత్వం కారణంగా రాష్ట్రంలో బీజేపీని బలపరిచేందుకు చాలా గట్టి ప్రయత్నాలు చేయవచ్చును. కనుక వారి కారణంగా తెదేపా, బీజేపీ సంబంధాలు చెడే అవకాశం ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వారు దోహదపడవచ్చును. అయితే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు విషయంలో వారు ప్రజలకు సంతృప్తికరమయిన జవాబు చెప్పి మెప్పించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్‌లో ఉండను : మల్లారెడ్డి

బీఆర్ఎస్‌లో ఉండేది లేదని మల్లారెడ్డి ప్రకటించారు. తాను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడ్ని కాదని.. పార్ట్ టైమ్ రాజకీయ నేతను.. పూర్తి స్థాయి వ్యాపారవేత్తనని చెప్పుకొచ్చారు. తన వ్యాపారాలకు రక్షణ కోసమైనా...

లేటుగా వ‌చ్చినా ప్ర‌తాపం చూపిస్తున్న‌ ‘హ‌నుమాన్’

ఈ యేడాది సంక్రాంతికి విడుద‌లైన `హ‌నుమాన్` బాక్సాఫీసు ద‌గ్గ‌ర కొత్త రికార్డులు సృష్టించింది. చిన్న సినిమాగా వ‌చ్చి ఏకంగా రూ.300 కోట్ల మైలు రాయిని అందుకొంది. ఇప్పుడు ఓటీటీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక్క‌డా.. 'హ‌నుమాన్‌'...

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close