చంద్రబాబు కోరుకుంటున్నదే ఏపీ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారా..?

పెళ్లిచూపులు అయిపోయిన తర్వాత… అమ్మాయి నచ్చలేదని చెబుతుందని తేలిపోవడంతో… అబ్బాయే ముందస్తుగా వద్దని చెప్పడం కొన్ని సినిమాల్లో చూస్తూంటాం… ఇప్పుడు ఇలాంటి సీనే.. ఏపీ రాజకీయల్లోనూ కనిపించబోతోంది. తెలంగాణ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాకపోవడంతో … ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం, సీట్లు కేటాయించడం తెలుగుదేశం పార్టీకి సుతారమూ ఇష్టం లేదు. ఆ విషయాన్ని చంద్రబాబునాయుడు సున్నితంగానే రాహుల్ గాంధీకి చెప్పి వచ్చారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనూహ్యంగా ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా… తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని రాహుల్‌కు చెప్పడం ప్రారంభించారట. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల మాటల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రోజుల కిందట 29 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లతో రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. ఆ సమయంలో టీడీపీతో పొత్తు వద్దని రాహుల్ తో వివరించారట.

చంద్రబాబుకు కావాల్సిందే… కాంగ్రెస్ నేతలు చెబుతూండటంతో.. ఈ రెండు పార్టీల మధ్య పంచాయతీ అసలు ప్రారంభమయ్యే అవకాశమే లేదు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు… కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా మద్దతు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. అయితే.. ఏపీలో పరిస్థితులు మాత్రం భిన్నం. ఏపీ ప్రజల్లో ఇంకా.. విభజన ఆగ్రహం చల్లారలేదు. పైగా… కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి క్యాడర్ లేదు. ఉన్న క్యాడర్ మొత్తం ఎప్పుడో… వైసీపీలో చేరిపోయారు. లీడర్లు కూడా లేరు. ఇలాంటి సమయంలో… కాంగ్రెస్‌తో కలసి నడవడానికి చంద్రబాబు సిద్ధమవడానికి కారణం ప్రత్యేకహోదానే. కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న … ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని… ప్రకటిస్తున్న కాంగ్రెస్ కాబట్టి… చంద్రబాబు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది జాతీయ స్థాయి కాబట్టి.. అక్కడ మద్దతిస్తే సరిపోతుందన్నది చంద్రబాబు అభిప్రాయం.

చంద్రబాబు కూడా పొత్తుకు దూరం .. దూరం అంటూడటంతో… ముందస్తుగా తామే పొత్తు వద్దని.. కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు కానీ… కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న కొంత మంది సీనియర్ల ఆలోచన మాత్రం వేరుగా ఉంది. అసెంబ్లీ సీట్లు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు.. ప్రత్యేకహోదా కోసం అయినా… మూడు, నాలుగు పార్లమెంట్ సీట్లు కేటాయించేలా చూడాలని… వారు హైకమాండ్ పెద్దలతో.. సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచాతరం జరుగుతోంది. రఘువీరారెడ్డి, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, పళ్లం రాజు, కిల్లి కృపారాణి లాంటి నేతలు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇలాంటి వారి కోసం… లోక్‌సభ సీట్లు ఇప్పిస్తే చాలని… వారు లాబీయింగ్ చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే కీలకం..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close