మైనార్టీలు టీడీపీకి దగ్గరవుతారా..?

తెలుగుదేశం పార్టీ.. గుంటూరులో మైనార్టీల సదస్సు నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో.. మైనార్టీలంతా మూకుమ్మడిగా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఓట్లేశారు. ఆ ప్రభావం.. ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీ.. మంచి ఫలితాలను సాధించింది. అయితే.. ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. తెలుగుదేశం పార్టీ.. బీజేపీకి గుడ్ బై చెప్పడమే.. కాదు.. అత్యంత అగ్రెసివ్‌గా ఆ పార్టీ మీద పోరాడుతోంది. అదీ కూడా.. ముస్లింలు అత్యంత తీవ్రంగా వ్యతిరేకించే నరేంద్రమోడీ మీద.. చంద్రబాబు ఒంటికాలిపై వెళ్తున్నారు. మోడీని ఢీకొట్టే మొనగాడు.. ఒక్క చంద్రబాబే అన్నట్లుగా.. ఆయన పోరాటం చేస్తున్నారు. దీన్ని అంది పుచ్చుకుని టీడీపీ నేతలు.. ప్రచారం జోరుగా చేస్తున్నారు.

అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసుల భయంతోనే.. మరో కారమంతోనే.. బీజేపీని పూర్తిగా వ్యతిరేకించలేని పరిస్థితిలో పడిపోయింది. ఈ పరిస్థితిని టీడీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంది. మైనార్టీలను పూర్తిగా తన వైపు తిప్పుకునేందుకు విస్తృత కసరత్తు చేస్తోంది. నంద్యాల ఎన్నికల సమయంలోనే… మైనార్టీ నేతలకు పదవులు అప్పగించారు. ఇప్పుడు.. మంత్రి పదవి కూడా ఇస్తానని.. చంద్రబాబు నేరుగా ప్రకటించారు. బహుశా.. మైనార్టీ సదస్సులోనే.. ఎమ్మెల్సీ షరీఫ్ ను మంత్రిని చేస్తానని.. చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో.. మైనార్టీలకు…సంక్షేమ పథకాల విషయంలో లోటు రానీయలేదు. చివరికి హజ్ యాత్రకు కూడా ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తున్నారు.

వైసీపీ మైనస్ పాయింట్లను కచ్చితంగా క్యాచ్ చేసిన టీడీపీ నేతలు.. మైనార్టీ సదస్సు ద్వారా.. వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. కొన్ని వరాలు కూడా చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. మైనార్టీలు తమ రక్షణ పరంగా సున్నితంగా ఉంటారు. ఎవరు రక్షణగా ఉంటారో వారికే మద్దతుగా ఉంటారు. ఈ విషయంలోనూ చంద్రబాబు కాస్తంత కేర్ తీసుకుంటున్నారు. కొద్ది రోజుల నుంచి నారా హమారా.. టీడీపీ హమారా పేరుతో.. క్యాంపెన్ చేస్తున్నారు. పనుల కోసం వచ్చే ఏ పార్టీ మైనార్టీ నేతను అయినా సరే చంద్రబాబు నిరాశ పరచడం లేదు. దాంతో.. గత ఎన్నికలతో పోలిస్తే.. ఇప్పుడు మైనార్టీల్లో టీడీపీపై సానుకూలత పెరిగిందనే అంచనాలున్నాయి. దీన్ని మరింత నిలబెట్టుకునేందుకు… మైనార్టీ సదస్సు ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close