హోదా కథకు చంద్రబాబు మంగళం!

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇక కేంద్రాన్ని ప్రాధేయపడేది లేదనీ, విభజన చట్టంలో హామీల అమలుకోసమే పోరాడతామనీ ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీంతో “ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హదా” కథ ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో, బిజెపి నాయకులు బహిరంగ సమావేశాల్లో ” ఎపికి చాలా చేశాం, ఇంకా చేస్తాం, హోదా కుదరదు, అయినా ఆలోచిస్తున్నాం” లాంటి పొడుగు కథలూ, పిట్టకథలూ చెబుతూ కేంద్రం హోదా ఇవ్వబోవడం లేదని సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా చేశారు.

హోదా సంజీవని కాదని చంద్రబాబు, బిజెపి నాయకులూ అన్నారు. చంద్రబాబు వైఖరివల్లే హోదా వావడం లేదని కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విమర్శించడంతో హోదా పై కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావు పెట్టిన ప్రయివేటు మెంబరు బిల్లుకి తెలుగుదేశం మద్దతు ఇచ్చింది. అది ఓటింగ్ కే రాలేదు.

ఈ నేపధ్యంలో కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమానికి హాజరయ్యారైన చంద్రబాబు విలెకరులతో మాట్లాడారు. ప్రతి సంవత్సరమూ రూ.16 వేల కోట్ల బడ్జెట్‌ లోటు ఏర్పడుతోందన్నారు. కేంద్రం ఈ కాలంలో రాష్ట్రానికి రూ.1,976 కోట్లు అందించిందని, అవసరమైన మేరకు మరిన్ని నిధులు అందించాలని ఆయన కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఇక కేంద్రాన్ని ప్రాధేయపడేది లేదనీ, విభజన చట్టంలో హామీల అమలుకోసమే పోరాడతామనీ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమ పథకాల అమల్లో రాజీపడబోమన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పేదల సంక్షేమ పథకాల అమల్లో రాజీపడబోమన్నారు.

ముఖ్యమంత్రి స్పష్టీకరణ ద్వారా ప్రత్యేక హోదా కోసం ”పోరాటం” నుంచి తెలుగుదేశం బయటకి వచ్చేసింది. బిజెపి ముందుగానే చేతులు ఎత్తేసింది. తోడుదొంగలని తెలుగుదేశం బిజెపిలను దుమ్మెత్తిపొయ్యడానికి ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరికింది. రాజకీయప్రయోజనాల కోసం ప్రజలప్రయోజనాలను అటకెక్కించిన అన్ని పార్టీలనూ చూస్తూ ఆంధ్రప్రదేశ్ తెల్లబోయింది

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close