టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు ..! హిట్‌లిస్ట్‌లో ఎంత మంది..?

తెలుగుదేశం పార్టీపై ముప్పేట దాడికి రంగం సిద్ధమయిందనే ప్రచారానికి బలం కలిగించే ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పోటీ చేస్తున్న ఉగ్రనరసింహారెడ్డికి చెందిన ఆస్పత్రిలో సోదాలు చేశారు. ఆ ఆస్పత్రి గుంటూరులో ఉంది. కనిగిరిలో ఉగ్రనరసింహారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ ఐటీ దాడుల వ్యవహారం ఒక్క సారిగా కలకలం రేపింది. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారాయణ ఇంటిపై.. మూడు రోజుల కిందట ఐటీ అదికారులమంటూ.. సోదాలకు దిగారు. మూడు గంటల పాటు మొత్తం సోదాలు చేసి.. ఏమీ దొరకలేదని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని… వెళ్లిపోయారు. దొరికినా.. దొరకకపోయినా… ఏదో విధంగా ఐటీ సోదాలు అనే ప్రచారాన్ని చేస్తే.. టీడీపీ నేతలు ఆత్మరక్షణలో పడతారన్న వ్యూహంతోనే.. మొదటగా ఈ సోదాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్లో.. కాస్త బలంగా ఉండి.. విజయం దిశగా ఉన్నారన్న అంచనాలు ఉన్న వారి హిట్‌లిస్ట్‌ను ఇప్పటికే.. ఐటీ అధికారులకు అందించారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వారిని ఆర్ధికంగా దిగ్భంధనం చేయడం.. మానసిక ఆందోళనకు గురి చేయడం వంటి లక్ష్యాలతో.. ఈ హిట్‌ లిస్ట్‌లో ఉన్న అభ్యర్థులను టార్గెట్ చేస్తారని అంటున్నారు. ఇప్పుడు ఇది ప్రారంభమేనని… ముందు ముందు తీవ్రమైన దాడులుతో పాటు… ఏమీ దొరకకపోయినా.. ఏదేదో దొరికిందనే ప్రచారం చేస్తారని… అనుమానిస్తున్నారు. గతంలో.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగినప్పుడు.. ఇలా జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా మండి పడ్డారు. తాటాకు చప్పుళ్లకు లొంగబోమని హెచ్చరించారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న వారిలో.. అనేక మంది ఆర్థిక నేరస్తులు ఉన్నారని.. టీడీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తున్న మళ్ల విజయ్ ప్రసాద్.. అనే అభ్యర్థి… వెల్ఫేర్ గ్రూప్ కంపెనీస్ పేరుతో దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు పైగా.. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించారు. ఇందులో ఐదు వందలకోట్లు ఎవరు డిపాజిట్ చేశారో కూడా.. ఎవరికీ తెలియదు. విజయవాడ నుంచి పోటీ చేస్తున్న పీవీపీ, మైలవరం నుంచి పోటీ చేస్తున్న వసంత కృష్ణప్రసాద్ పై ఈడీ కేసులు ఉన్నాయి. అలాగే.. మార్కాపురం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థితో పాటు పలువురిపై.. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన రికార్డులున్నాయి. వారు వైసీపీ అభ్యర్థులు.. కాబట్టి దాడి చేయడం లేదా.. అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close