చంద్రబాబుకు టీడీపీ నేతల హెచ్చరికలు..!

ఏడాదిన్నరలో జమిలీ ఎన్నికలు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. దానికి సంబంధించి వారి వద్ద స్పష్టమైన సమాచారం ఉందో లేదో స్పష్టత లేదు కానీ.. తాము ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో మాత్రం.. కంట్రోల్ తప్పి పోతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు.. తాము అధికారంలోకి వస్తే.. ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమని హెచ్చరిస్తూ ఉంటారు. చివరికి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అదే అంటున్నారు. చాలా మంది టీడీపీ నేతలు అదే చెబుతున్నారు కానీ.. కొంత మంది నేతలు మాత్రం.. టాపిక్‌ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దూరం కాబట్టి.. అధికారం అందినా.. తమను కంట్రోల్ చేయాలనుకుంటారని… వారు భావిస్తున్నారు. అందుకే… చంద్రబాబు అలాగే ఉంటే.. ఏ ఒక్క టీడీపీ నేత కూడా ఆయన మాట వినరని అంటున్నారు.

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదే విషయాన్ని నేరుగా చెప్పారు. కలెక్టర్, ఎస్పీ లు కూడా ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని.. ఏ అధికారిని వదలం ….అందరిని గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు పాత పద్దతి లోనే ఉంటే ఆయన మాట ఏ ఒక్క ఎమ్మెల్యే వినే పరిస్థితి ఉండదంటున్నారు. దెబ్బకు దెబ్బ తీసే విదంగా చంద్రబాబు మారాలి, మారకపోతే ఆయన ఒక్కరే మిగిలిపోతారని హెచ్చరికలు జారీ చేశారు. టిడిపి అంటే ఏంటో చూపిస్తాం…ప్రతి కార్యకర్త ను కాపాడుకుంటామని సవాల్ చేస్తున్నారు. అధికారంలోకి రావడం.. ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని ఆయన అంటున్నారు.

గతంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా అదే అన్నారు. తాము ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించకపోతే.. ఉరితాళ్లు తీసుకెళ్లి ఆయన ముందు నిల్చుంటామని.. చావమంటారా అని అడగడం తప్ప..ఇంకేమీ చేయలేమని ఆయనన్నారు. రాజకీయ కక్ష సాధింపులు.. ఏ రేంజ్‌లో ఉంటున్నాయో.. టీడీపీ నేతల స్పందనతోనే తెలిసిపోతోంది. అయితే.. వారందరికీ చంద్రబాబుపైనే అనుమానం. అధికారంలో ఉండగా.. ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడిన దాఖలాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తున్న పనుల్లో పది శాతం చేసినా వైసీపీ నేతల వ్యాపారాలన్నీ ఎప్పుడో కుప్పకూలిపోయి ఉండేవి. అందుకే టీడీపీ నేతల్లో ఆగ్రహం రగిలిపోతోంది. అధికారం అందిన తర్వాత తాము అంతకు మించి చేయాలన్న కసితో ఉన్నారు. చంద్రబాబు ఎక్కడ అడ్డుకుంటారోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు కూడా.. చాలా సార్లు తాము అన్నీ రాసి పెట్టుకుంటున్నామని ఎవర్నీ వదిలి పెట్టబోమన్న ప్రకటనలు ఇచ్చారు. కానీ పార్టీ నేతలు నమ్మలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close