లోక్‌సభ నుంచి 14 మంది టీడీపీ ఎంపీల గెంటివేత..! ఇప్పుడే ఎందుకు..?

లోక్ సభ నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది ఎంపీల్ని నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తూనే ఉన్నారు.
రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన 12 మంది తెదేపా ఎంపీలను మొదటగా సస్పెండ్‌ చేసిన సుమిత్రా మహాజన్‌.. మధ్యాహ్నం మరో ఇద్దరిపైనా నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. కావేరీ జలాల అంశంపై స్పీకర్‌ పొడియం వద్ద టీడీపీ ఎంపీలతో పాటు నినాదాలు చేసిన అన్నాడీఎంకే ఎంపీలను సైతం స్పీకర్‌ నాలుగు రోజుల పాటు సస్పెన్షన్‌ విధించారు. సస్పెండైన వారు బయటకు వెళ్లకుండా సభలోనే ఉండంతో… శుక్రవారానికి సభ వాయిదా వేశారు.

ఇన్ని రోజుల నుంచి.. నిరనస సాగిస్తున్నా.. ఈ రోజు మాత్రమే… ఎందుకు టీడీపీ ఎంపీలపై సస్పెన్షన్ వేటు ఎందుకు వేశారన్నదానిపై రాజకీయవర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సస్పెన్షన్ విషయం తెలిసిన తర్వాత నిరసన కొనసాగించాలని ఎంపీలను చంద్రబాబు ఆదేశించారు. విభజన హామీలపై పోరాడుతున్న టీడీపీ ఎంపీలను.. ఇవాళ సస్పెండ్‌ చేయడం వెనకున్న ఆంతర్యం ఏంటని సుజనా చౌదరి విమర్శించారు. బీజేపీని ధిక్కరించి ముందుకెళ్తే సభలో మాట్లాడకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏపీకి నిధులు అడిగే హక్కు మనకు లేదా అని ప్రశ్నించారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీల సస్పెన్షన్‌ ప్రజాస్వామ్యానికే మచ్చ అని మరో ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయాలని కోరితే గొంతు నొక్కేస్తున్నారన్నారు. మోదీ, జగన్‌ కలిసి ఏపీకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనూహ్యంగా టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేయడానికి కారణం ఏమిటన్నదానిపై చర్చలు నడుస్తున్నాయి. ఏపీకి సంబంధించిన ఏ అంశంపైనా… ప్రకటన చేయబోతున్నారా… దానికి అడ్డం లేకుండా.. ఎంపీలను బయటకు పంపారా.. అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ విషయంలో.. టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయట తమ ఆందోళన కొనసాగించే అవకాశాలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close