లోక్‌సభ ఎన్నికలకు టీ టీడీపీ దూరం..! కాంగ్రెస్‌కు మద్దతు..!

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్‌ నుంచి ఆ పార్టీలో మిగిలి ఉన్న నేతలు ఇప్పటి వరకూ తేరుకోలేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా.. ఎవరూ.. ఎన్నికల గురించి ఆలోచించలేదు. దాంతో.. టీ టీడీపీ పోటీ చేస్తుందా.. లేదా.. అన్న దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. చివరికి గత ఎన్నికల్లో ప్రజాకూటమిగా ఏర్పడిన పార్టీలు కూడా.. ఈ సారి పొత్తుల గురించి మాట్లాడుకోలేదు. కాంగ్రెస్ పార్టీ తన మానాన తాను అభ్యర్థులను ఎంపిక చేసుకుంది. టీడీపీని సంప్రదించలేదు. కమ్యూనిస్టులు, కోదండరాంను కూడా సంప్రదించలేదు. దాంతో.. ఆ పార్టీలన్నీ ఈ సారికి.. దూరంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మాదిరి ఫలితాలు వచ్చినా… పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం మల్కాజిగిరి, ఖమ్మం పార్లమెంట్ స్థానాలను పొందాలని.. టీడీపీ అనుకుంది. కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన షాక్‌తో.. అసలు పోటీ నిర్ణయమే విరమించుకుంది. చివరికి ఖమ్మం బరిలో ఉంటారనుకున్న నామా నాగేశ్వరరావు కూడా.. పార్టీకి గుడ్ బై చెప్పి.. టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడటంతో.. ఉన్న ఒకే ఒక్క హోప్ కూడా.. లేకుండా పోయింది. ఇప్పటి పరిస్థితుల్లో.. కాంగ్రెస్‌కు మద్దతు పలకడమే మంచిదన్న ఉద్దేశంతో.. ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా… టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణకు ఫోన్ చేసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇది అత్యంత పతనావస్థ. ఇప్పటి వరకూ.. టిక్కెట్ల కోసం పోటీ పడ్డవారే కానీ… పోటీ చేయలేని స్థితికి తెలంగాణలో టీడీపీ ఎప్పుడూ లేదు. తెలంగాణలో బడుగులకు రాజ్యాధికారం దక్కేలా చేసింది టీడీపీ అన్న విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ఇలాంటి టీడీపీని ప్రజలు ఆదరించలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులు ముందు ముందు మారుతాయని..టీడీపీ నేతలు ఆశ పడుతున్నారు. కానీ.. అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close