గెలుపైపు నమ్మకం..! తనను తాను మోసం చేసుకున్న టీడీపీ..!

తనను తాను టీడీపీ మోసం చేసుకుంది. ఏడాదిన్నర కిందట.. నంద్యాల ఉపఎన్నికలు జరిగాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. పైగా.. వైసీపీ అండగా ఉంటారనుకున్న వర్గాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. అందుకే… వైసీపీ గెలుపు ఖాయమని ప్రచారం జరిగింది. టీడీపీపై చాలా వ్యతిరేకత ఉందని… ఓడిపోవడం ఖాయమని చెప్పుకునేందుకు మైండ్ గేమ్ ఆడారు. జగన్మోహన్ రెడ్డి కూడా… నంద్యాలలో.. పదిహేను రోజుల పాటు ప్రచారం చేశారు. ఓ పార్టీ అధ్యక్షుడు..ఓ అసెంబ్లీ స్థానంలో పదిహేను రోజుల పాటు ప్రచారం చేసిన వైనం ఎక్కడా లేదు. ఇక.. అక్కడ తిరుగులేని విజయం.. వైసీపీదేనననుకున్నారు. కానీ ఫలితం తేడా కొట్టింది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది. అప్పుడు వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. కానీ జగన్ మాత్రం వెనుకడుగు వేయలేదు. ఆ వెంటనే పాదయాత్ర ప్రారంభించారు. పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకువచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని టీడీపీ నేతలు పదే పదే ప్రచారం చేశారు. ఎంతగా.. అంటే.. ప్రజలు కూడా.. నిజమే అనుకునేలా ఆ మైండ్ గేమ్ నడిచింది. సోషల్ మీడియాలో.. ఈ ప్రచారం జరిగింది. అయితే.. ఈ ప్రచారం వల్ల.. టీడీపీ నేతలు.. ఓవర్ కాన్ఫిడెన్స్ కు వెళ్లారు. వైసీపీ నేతలు అభద్రతా భావానికి గురయ్యారు. కానీ ఓటర్లు మాత్రం గందరగోళానికి గురి కాలేదు. తమకు ఎవరు కావాలో.. వారినే… ఎంచుకున్నారు. ఆ విషయం ఓటింగ్ లో స్పష్టమయింది.. ఇలాంటి మైండ్ గేమ్‌తో.. వైసీపీకి తెలుగుదేశం పార్టీకి మేలు చేసింది. ఎందుకంటే… సాధారణంగా ఏదైనా పార్టీ ఎప్పుడైనా గెలుస్తుందనే.. ఫీలింగ్ వస్తే.. ఆ పార్టీకి చెందిన ఓటర్లు.. ఓటింగ్ వరకూ వెళ్లడానికి బద్దకిస్తారు. వైసీపీ నేతలు చేసిన ప్రచారంతో.. ఎక్కడెక్కడో ఉన్న వారంతా… ఓ భావోద్వేగం వారిలో కనిపించింది. జగన్ ను సీఎం చేశారు.

అదే సమయంలో.. టీడీపీ మైండ్ గేమ్‌… ఆ పార్టీకి నష్టం చేసిందని.. కొన్ని కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఓడిపోయిన విషయంతో తేలిపోయింది. ఇక గెలుపే మిగిలిందనుకున్న పార్టీల నేతలు.. చాలా మంది.. ఎన్నికల ఖర్చును.. మధ్యలోనే ఆపేశారని… ప్రచారం జరుగుతోంది. ఫలితంగా…టీడీపీ ఓటర్లు ఓటు వేయడానికి ఆసక్తి చూపలేదని.. ఫలితాల సరళిని బట్టి తేలిపోతోంది… మొత్తానికి మైండ్ గేమ్ రాజకీయాలు.. సక్సెస్ కావని.. ఈ ఎన్నికలు.. టీడీపీ మరోసారి గుణపాఠంగా చెప్పినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close