సాక్షికి కోట్ల ప్రకటనలపై సీబీఐ విచారణ వద్దా..!?

ప్రభుత్వానికి హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల విషయంపై సీబీఐ విచారణ కోరాలని ఏపీ కేబినెట్ నిర్ణయించడంపై టీడీపీ భిన్నంగా స్పందించింది. సీఎం జగన్ సొంత కంపెనీ సరస్వతి పవర్‌కు నీళ్లు… గనులు కేటాయించడంపై… సాక్షిపత్రికకు కోట్లకు కోట్లు యాడ్స్ ఇవ్వడంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రికకు ఎప్పుడూ లేనన్ని ప్రకటనలు వస్తున్నాయి. అత్యధిక సర్క్యూలేషన్ కలిగిన పత్రిక కాకపోయినా… ఈనాడుకు కన్నా ఎక్కువగా యాడ్స్ ఇస్తున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖ మాత్రమే కాకుండా.. వివిధ మంత్రుల శాఖలు కూడా ఇస్తున్నాయి.

ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా.. పదిహేను పేజీల ఫుల్ పేజీ యాడ్స్ సాక్షికి వచ్చాయి. అదే సమయంలో.. సాక్షి పత్రికకు సంబంధించిన అనేక మంది ఉద్యోగులు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ప్రభుత్వంలో చేరారు.చాలా మంది సలహాదారులుగా కూడా…చేరారు. వీటన్నింటినీ టీడీపీ హైలెట్ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏడాది కాలంగా గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీస్తామంటూ ప్రకటనలు చేసిన ప్రభుత్వం.. అనేక విచారణ కమిటీలు వేసింది. కానీ ఏమీ తేల్చలేకపోవడంతో టీడీపీ ఇప్పటికే విమర్శలు ప్రారంభించింది.

ఈ క్రమంలో చంద్రన్న కానుకలు… ఫైబర్ నెట్ అవినీతి పై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ కేబినెట్‌లో నిర్ణయించడం…టీడీపీని కూడా ఆశ్చర్య పరిచింది. అందుకే ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కంపెనీలకునేరుగా లబ్ది కలిగించే నిర్ణయాలను ప్రభుత్వం తీసుకోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close