“కాకాణి ఫైల్స్” కేసుపై టీడీపీ రివర్స్ !

నెల్లూరులో “కాకాణి ఫైల్స్” చోరీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జిల్లా జడ్జి మొత్తం చోరీ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ నివేదిక ఇచ్చారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తును సరిగ్గా చేయలేదని తేల్చారు. దీంతో ఈ కేసు అంశాన్ని సీబీఐకి ఎందుకివ్వకూడదని హైకోర్టు వాదనలు వింటోంది. ఏపీ ప్రభుత్వం మొదట కోర్టులో చోరీ అంశాన్ని సీబీఐతో విచారణ జరిపిస్తే ఇబ్బంది లేదని చెప్పింది. ఇప్పుడు కాకాణిపైఉన్న నకలీ డాక్యుమెంట్ల కేసును కూడా సీబీఐకి ఇచ్చినా అభ్యంతరం లేదని హైకోర్టుకు తెలిపారు.

ప్రభుత్వం ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడాన్ని టీడీపీ ప్రశ్నిస్తోంది. గతంలో వివేకా కేసు సీబీఐకి ఇవ్వవొద్దని అదే పనిగా వాదించారని కానీ సీబీఐకి ఇచ్చిన తర్వాత విచారణను ఎక్కడిక్కడ అడ్డుకున్నారని .. ఆ విధంగానే కాకాణి కేసును కూడా అడ్డుకుందామని ప్రయత్నిస్తున్నారా.. .. అదే ప్లాన్‌తో సీబీఐకి ఇవ్వమని అడుగుతున్నారని అని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీనిని కూడా వివేకా హత్య కేసులానే సాగ తీయొచ్చనా? అని నిలదీశారు. లేదంటే అసలు దోషులే దొరక్కుండా చేయొచ్చనా? అని వైసీపీని టీడీపీ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు.

నిజానికి కాకాణి నకిలీ డాక్యుమెంట్ల కేసు అయినా.. కోర్టులో చోరీ కేసు అయినా ఏపీ పోలీసులు విచారణ జరిపితే ఏమవుతుందో టీడీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే సీబీఐకి ఇవ్వాలని వారు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా సీబీఐకి ఇస్తే అభ్యంతరం లేదని చెప్పడంతో రివర్స్ విమర్శలు చేస్తున్నారు. లేటు చేయడానికి సాక్ష్యాలు తారుమారు చేయడానికి ఇలా చేస్తున్నారంటున్నారు. మొత్తంగా చూస్తే.. ఏ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసినా.. రెండు పార్టీల్లో ఎవరో ఒకరు అనుమానించడం రివాజుగా మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close