ఎన్నికల ప్రక్రియ రద్దు కోసం కోర్టుకెళ్లనున్న టీడీపీ..!

ఎన్నికలు వాయిదా కాదు.. ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని.. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీని కోసం.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందుకు.. ఏపీ సర్కార్ ఎన్నికల నిర్వహణ కోసం.. హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్‌ కేంద్రంగా న్యాయపోరాటం చేసే అవకాశం దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే.. నామినేషన్ల సందర్భంగా జరిగిన హింసతో పాటు ఉపసంహరణ కోసం.. పోలీసులే బెదిరింపులకు పాల్పడటం వంటి అంశాలపై… పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన టీడీపీ ఈ మేరకు మొదటగా.. ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేసింది. తర్వాత దశలో హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్దమవుతోంది.

ఎన్నికల్లో అక్రమాలతో పాటు.. ఆర్డినెన్స్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. ఇప్పుడు విపత్తు పరిస్థితులతో.. ఆ మాత్రం నిర్వహించడం లేదు కాబట్టి.. ఎన్నికల ప్రక్రియ చెల్లదన్న వాదన వినిపించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అదే సమయంలో.. ఎన్నికల వివాదాలకు సంబంధిన ఆధారాలను సిద్ధం చేసుకుంటోంది. ఎన్నికల సంఘం ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది..కానీ.. కరోనా విపత్తు ఎంత కాలం ఉంటుందో.. అంచనా వేయడం కష్టం. ఒక వేళ.. కరోనా వ్యాప్తి ఆగిపోయిదని తెలిసిన తర్వాత కూడా… నాలుగైదు వారాలు.. జాగ్రత్తగా ఉండాలని కేంద్రం.. ఆదేశాలు జారీ చేస్తుంది.

దీని ప్రకారం చూస్తే.. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడల్లా జరగవన్న అభిప్రాయం బలపడుతోంది. ఆర్డినెన్స్ ప్రకారం చూస్తే. .. ఎన్నికల ప్రక్రియ క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఇదే అంశం ఆదారంగా.. టీడీపీ కూడా.. ఎన్నికల ప్రక్రియను రద్దు చేసేలా పోరాడి.. ఆ తర్వాత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close