ఈ సారి “రంగుల దెబ్బ” కొట్టే వ్యూహంలో టీడీపీ..!

ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెట్టడానికి అందుబాటులో ఉన్న వీలైన అవకాశాలకు తెలుగుదేశం పార్టీ మరింత దూకుడుగా వెళ్తోంది. ఈ సారి కోర్టు ధిక్కరణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. వారం రోజుల కిందట.. హైకోర్టు… ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగులన్నింటినీ.. పది రోజుల్లోపు తొలగించాలని ఆదేశించింది. తొలగించకపోతే.. సంబంధిత అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని.. హెచ్చరించింది. పది రోజుల్లోగా తొలగించి ప్రమాణ పత్రం దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటి వారం రోజులు అయింది. కానీ… ప్రభుత్వ భవనాలపై ఉన్న రంగులన్నీ ఎక్కడివక్కడే ఉన్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న రంగులను తొలగించే ప్రయత్నమే జరగలేదు. సీఎస్ కూడా.. ఓ చిన్న మెమో జారీ చేసి.. సైలెంట్ గా ఉండిపోయారు. తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గ్రామాల్లో ఉన్న తమ క్యాడర్ అందరికీ… రంగులున్న భవనాల ఫోటోలు పంపాలని సమాచారం ఇస్తోంది. ఆ మేరకు.. మొత్తం సమాచారాన్ని సేకరించి.. ఎస్ఈసీ ఎన్నికల కోడ్‌ను అమలు చేయలేకపోతోందని.. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని వాదిస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల సందర్భంగా.. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రత్యేకంగా ఓ కాల్ సెంటర్ ను పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

కాల్‌సెంటర్‌కు పెద్ద ఎత్తున వీడియోలను పార్టీ కార్యకర్తలు పంపారు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో మీడియాకు కూడా ఇవ్వడంతో.. ఎక్కడిక్కడ అక్రమాలు పెద్ద ఎత్తున ప్రచారం అయ్యాయని టీడీపీ నమ్ముతోంది. ఇప్పుడు ప్రభుత్వాన్ని పార్టీ కార్యాలయాలకు వేసిన రంగుల ద్వారా ఫిక్స్ చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

ఇప్పటికీ ఎన్డీఏ వెంట పడుతున్న జగన్ !

రాజకీయం అంటే విదిలించుకున్నా వదిలి పెట్టను అని కాళ్లు పట్టేసుకోవడం కాదు. కానీ వైసీపీ అధినేతకు మాత్రం అదే రాజకీయం. ఎందుకంటే వదిలిస్తే కేసులకు కొట్టుకుపోతారు. అందుకే బీజేపీ వాళ్లు విదిలించుకున్నా ...

ఆన్న ఆస్తి ఇవ్వకపోతే షర్మిల కోర్టుకెళ్లవచ్చుగా !?

సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంచివ్వలేదని.. ఒక్కకొసరు ఆస్తి రాసిచ్చి దాన్ని కూడా అప్పు కింద జమ చేసుకున్నారని షర్మిల వేదనకు గురయ్యారు. తన పిల్లలకు తాను ఏమీ ఇవ్వలేకపోతున్నానని ఆమె ఆవేదన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close