“గుడివాడ” గడ్డ నుంచే చాలెంజ్ విసరనున్న టీడీపీ

తెలుగుదేశం పార్టీ గుడివాడ నడి బొడ్డున మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మహానాడును నెలాఖరులో గుడివాడలో ఖరారు చేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఆ జిల్లాలోనే బస చేసి పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయబోతున్నారు. గుడివాడలోనే మహానాడు పెట్టాలని నిర్ణయించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కొడాలి నాని విషయంలో టీడీపీ క్యాడర్ అసహనంతో ఉన్నారు. చంద్రబాబుతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై ఇష్టారీతిన తిట్లతో విరుచుకుపడే వంశీకి ఈ సారి బుద్ది చెప్పాలన్న లక్ష్యంతో ఎక్కువ మంది ఉన్నారు.

అయితే గుడివాడలో సరైన అభ్యర్థి లేకుండా పోయారు. రావి కుటుంబం నుంచి మార్చి కొడాలి నానికి చంద్రబాబు చాన్సు ఇచ్చిన తర్వాత టీడీపీ తరపున రెండు సార్లుఆయన గెలిచారు. కొడాలి దెబ్బకు రావి కుటుంబం రాజకీయంగా సైలెంట్ అయిపోయింది. కొడాలి పార్టీ మారిన తర్వాత రావి వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు. ఆయన ఓ సారి నిలబడి ఓడిపోయారు. గత ఎన్నికల్లో దేవినేని అవినాష్‌కు టీడీపీ చాన్సిచ్చింది. అయితే ఆయన కూడా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ రావి కుటుంబానికే చాన్సివ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గుడివాడలో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడే మహానాడు పెట్టి .. భయపడేది లేదని ప్రతీ దానికి బదులు చెల్లిస్తామని హెచ్చరికలు పంపితేనే క్యాడర్‌లో కదలిక వస్తుందని టీడీపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మహానాడును గుడివాడలో ఖరారు చేశారు. రెండు రోజుల పాటు చంద్రబాబు అక్కడే ఉండి… గుడివాడ అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వడంతో పాటు వ్యూహాలను ఖరారు చేసే అవకాశం ఉంది. కొడాలిపై ఉన్న వ్యతిరేకత గుడివాడలో మహానాడులో కనిపించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close