బెజవాడలో టీడీపీ వర్సెస్ కేశినేని..!

కార్పొరేషన్ ఎన్నికలకు ముందు విజయవాడ తెలుగు తమ్ముళ్లు.. తమలో తాము పోటీ పెట్టుకున్నారు. ఎవరు గొప్పో తేల్చుకుందామన్నంతగా పోటీ పడుతున్నారు. ముక్కుసూటిగా రాజకీయం చేసే కేశినేని ఓ డివిజన్‌లో గతంలో బీఫాం ఇచ్చిన అభ్యర్థిని కాదని… అలిగి వైసీపీలోకి పోయి.. అక్కడ టిక్కెట్ దక్కించుకోలేక మళ్లీ టీడీపీలోకి వచ్చిన నేతకు మరో బీఫాం ఇవ్వడంతో సమస్య ప్రారంభమయింది. ఓ వైపు బుద్దా వెంకన్న, బొండా ఉమ వర్గాలు.. మరో వైపు కేశినేని నాని దూకుడుగా ప్రకటనలు చేస్తున్నారు. కేశినేని నాని కుమార్తె శ్వేత కూడా కార్పొరేషన్ బరిలో ఉన్నారు. ఆమెను మేయర్ అభ్యర్థిగా కేశినేని వర్గం ప్రచారం చేసుకుంటోంది. అయితే బొండా ఉమ వర్గం మాత్రం అలా ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తోంది.

బుద్దా వెంకన్న వర్గం.. తమ వర్గీయుల బీఫాంలను వెనక్కి తీసుకుని వేరేవారికి ఇవ్వడం.. అదీ కూడా వైసీపీలోకి వెళ్లి వచ్చిన వారికి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తోంది. ఈ వివాదాలపై బుద్దా వెంకన్న, బొండా ఉమ బహిరంగంగా మాట్లాడటం లేదు. వారి అనుచరులు మాట్లాడుతున్నారు. కానీ కేశినేని నాని మాత్రం… చంద్రబాబును కూడా పట్టించుకోను అన్నట్లుగా మాట్లాడేస్తున్నారు. ఎవరైనా తన వెంట నడవాలి కానీ తాను ఎవరి వెంట నడవబోనని ప్రకటించేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇరు వర్గాలకు ఫోన్ చేసి.. బహిరంగ ప్రకటనలు చేయవద్దని.. చంద్రబాబు చెప్పినట్లుగా చేద్దామని సూచించారు.

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్.. చంద్రబాబు నిర్ణయమే తమ నిర్ణయమని చెబుతున్నారు. టీడీపీ ఓడిపోయిన తర్వాత కేశినేని నాని అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన టీడీపీకి దూరమయ్యారని అనుకున్నారు. తర్వాత పరిస్థితులు చల్లబడ్డాయి. ఇప్పుడు మళ్లీ విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తన కుమార్తె పోటీకి నిలబెట్టి మేయర్‌ను చేయాలనుకుని రాజకీయం చేస్తున్నారు. తన సొంత బలంతోనే గెలిపించుకుంటానని చెబుతూ.. పార్టీని దాదాపుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నంత పని చేస్తున్నారు. దీన్ని టీడీపీ అగ్రనాయకత్వం ఎలా కవర్ చేస్తుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close