టీడీపీకి స్థానిక ఎన్నికలు ఇప్పుడే వద్దట..!

స్థానిక ఎన్నికలు నిలిపివేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. దీనికి బీసీ రిజర్వేషన్లతో పాటు … కరోనాను కూడా కారణంగా చూపిస్తోంది. ఈ మేరకు.. టీడీపీ నేతలు.. సీఎం జగన్‌కు బహిరంగలేఖ రాశారు. సుప్రీంకోర్టులో టీడీపీ వేసిన బీసీల రిజర్వేషన్ల పిటిషన్‌లో.. రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్‌ కావాలలని.. లేఖలో ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లలో 10శాతం కోత విధించి బీసీ హక్కులకు భంగం కలిగించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం బీసీల రాజకీయ అవకాశాల్ని అణిచివేయడమేనని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. మరో టీడీపీ బీసీ నేత నిమ్మల కిష్టప్ప మాత్రం ఎన్నికల వాయిదాకు.. కరోనాను కారణంగా చూపిస్తున్నారు.

కరోనా వైరస్‌ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని.. క్యూలైన్ల ద్వారా కరోనా ప్రమాదం పొంచి ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు..ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని అంతిమంగా అందరూ డిమాండ్ చేశారు. ఏ పార్టీ అయినా.. ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తే.. మానసికంగా ఓటమికి సిద్దమయిందని.. విమర్శలు వస్తాయి. ప్రజల్లో కూడా అలాంటి ఫీలింగ్ వస్తుంది. అయినప్పటికీ..బీసీ వాయిస్‌ను గట్టిగా వినిపించాలనుకుంటున్న టీడీపీ.. ఎన్నికల వాయిదాను.. కోరుకుంటోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికే అనుకూలంగా వస్తాయి.

ప్రభుత్వ పథకాలు … అధికార యంత్రాంగం సహకారం .. ఇలా అన్నీ కలిసి వస్తాయి. అయితే.. ఓట్లు వేయాల్సింది ప్రజలే. వారి ఆగ్రహం తీవ్ర స్థాయిలో ఉంటే.. ఇవన్నీ ఏమీ చేయలేవు. కానీ..ఎన్నికల సంఘం కూడా చేతుల్లో ఉంటుంది.. పైగా కొత్త ఆర్డినెన్స్ కూడా తీసుకు వచ్చారు. దీంతో టీడీపీ నేతలు.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోతేనే బాగుంటుందని కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close