ఏపీలో కాంగ్రెస్‌తో టీడీపీ సీట్ల సర్దుబాటు లేనట్లే..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి రాజకీయ వ్యూహం అమలు చేయాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ క్లారిటీకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఢిల్లీలో నాలుగుగంటల పర్యటనలో.. రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన … సీట్ల సర్దుబాటు గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పొత్తులు ఉంటాయని.. కాంగ్రెస్‌తోనూ ఇందుకు అనుగుణంగానే వ్యవహరిస్తామని ప్రకటించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు లేకపోయినా… జాతీయస్థాయిలో కలిసొచ్చే అంశాలు పరిశీలించాలని వ్యాఖ్యానించారు. అంటే ఆయన… రాహుల్‌గాంధీతో.. ఏపీలోని పరిస్థితుల్ని వివరించి.. సీట్ల సర్దుబాటు సాధ్యం కాదని… జాతీయ స్థాయిలో మాత్రం మద్దతుగా ఉంటామని చెప్పినట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో మిగిలి ఉన్న నేతలు.. ఆశలు పెట్టుకున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా తిరిగి.. రఘువీరారెడ్డి ఓ లిస్ట్ కూడా రెడీ చేసుకున్నారు. దాన్ని తీసుకెళ్లి రాహుల్ గాంధీకి ఇచ్చారు. పొత్తుల సంగతి త్వరగా తేల్చాలని కోరారు. అయితే.. తెలంగాణ ఎన్నికల్లో… భారీ ఎదురు దెబ్బ తగలడంతో.. చంద్రబాబు సీట్ల సర్దుబాటు విషయంలో.. ఆలోచిస్తున్నారు. అనేక సర్వేలు.. పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటే… కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు వద్దనే ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే… రాహుల్‌కు తన అభిప్రాయం చెప్పి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నేతలకు.. పరోక్షంగా తెలియజేస్తున్నారు.

బీజేపీయేతర కూటమి పక్షాలకు 19వ తేదీ కీలకం. ఆ రోజున మమతా బెనర్జీ.. కోల్‌కతాలో బీజేపీకి వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో మమతా బెనర్జీని దెబ్బకొట్టడానికి.. ఆమె పార్టీకి చెందిన ఎంపీలను బీజేపీలో చేర్చుకునేందుకు అమిత్ షా రెడీ అయ్యారు. ఇప్పటికే ఒకర్ని చేర్చుకున్నారు. మరో ఐదుగురు వస్తారంటూ.. ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో… మమతా బెనర్జీ… ర్యాలీలో.. విపక్షాల ఐక్యతను చాటాలనుకుంటున్నారు. కానీ ఆమె కాంగ్రెస్‌తో దూరంగా ఉంటున్నారు. ఈ సందర్భంగా.. వీలైనన్ని ఎక్కువ విపక్ష పార్టీలను.. కోల్‌కతా ర్యాలీకి హాజరయ్యేలా చూసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆ ర్యాలీలో విపక్షాలు ఐక్యత చూపించగలిగితే… చంద్రబాబు కూడా కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు అంశంపై నిర్ణయం వెంటనే ప్రకటించడానికి అవకాశం ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close