తొలి టెస్ట్ డిజాస్టర్..! పిచ్ భయంతో టీమిండియా ఓటమి..!

ఆడిలైట్ టెస్టులో రెండో రోజు పదిహేను వికెట్లు పడేసరికి.. ఇక మూడో రోజు ఎలా ఉంటుందో అని రాత్రంతా నిద్రలేకుండా టీమిండియా ఆటగాళ్లు ఆందోళన పడినట్లుగా ఉన్నారు. పిచ్ మీదకు బ్యాటింగ్‌కు వచ్చిన వారు వచ్చినట్లుగా వెనక్కి వెళ్లిపోయారు. చివరికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అంత స్కోర్ కూడా పది మంది కలిసి కొట్టలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 అంటే 36 పరుగులు చేశారు. టెస్టు చరిత్రలో ఇది నాలుగో అత్యల్ప స్కోరు. ఆట మొదలైన రెండో ఓవర్ నుంచే వికెట్లు నేర రాలడం ప్రారంభమయింది. హాజిల్‌వుడ్‌ ఐదు వికెట్లు, కమిన్స్ నాలుగు వికెట్లు పంచుకున్నారు.

హాజల్ వుడ్ ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒక్కరు కూడా రెండంకెల స్కోర్‌ నమోదు చేయలేదు. పిచ్ భయం ఆటగాళ్లను ఎంతగా భయపెట్టిందంటే.. చివరికి బ్యాట్స్‌మెన్ షమీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మొత్తం 21 ఓవర్లు ఆడి చేసిన స్కోరు 36 పరుగులు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 53 పరుగుల ఆధిక్యం లభించడంతో ఆస్ట్రేలియా లక్ష్యం 90 పరుగులుగా తేలింది. భారత ఆటగాళ్లు అలా ఔటయ్యారు కాబట్టి.. నిజంగానే పిచ్ అంత ఘోరంగా ఉందేమో.. భారత బౌలర్లు కూడా చెలరేగిపోతారేమో అని ఆశ పడిన భారత అభిమానులకు నిరాశే ఎదురయింది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఆడుతూ పాడుతూ 90 పరుగులు కొట్టేశారు. రెండు వికెట్లు కోల్పోయారు. మొత్తంగా తొలి టెస్టు రెండున్నర రోజుల్లోనే పూర్తయింది. టీమ్‌ఇండియా ఘోర పరాభవం చవిచూసింది. రెండో టెస్టు డిసెంబర్‌ 26న మెల్‌బోర్న్‌లో జరగనుంది.

ఆడిలైడ్ పిచ్.. పరుగులు చేయడానికి ఇబ్బందికరమైన పిచ్‌నే కానీ.. మరీ భయపడి వికెట్లు పారేసుకోవాల్సింత ఘోరమైన పిచ్ ఏమీ కాదు. కాస్త నిబ్బంరంగా ఉంటే.. పరుగులు అవే వచ్చేవి. తొలి రోజు భారత ఆటగాళ్లు అంతే ఆడారు. కానీ రెండో రోజు వికెట్లు పడిన తీరు చూసి.. మానసికంగా ఇబ్బందిపడిపోయారు. ఆ ప్రభావం నేరుగా ఓటమి దగ్గరకు తీసుకెళ్లింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close