‘స‌ర్కారు వారి పాట‌’ టీజ‌ర్ క‌ష్టాలు

ఈనెల 31న కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `స‌ర్కారు వారి పాట‌` టీజ‌ర్ వ‌స్తుంద‌ని మ‌హేష్ బాబు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప‌ర‌శురామ్ టీమ్ కూడా ఇప్పుడు అదే ప‌నిలో ఉంది. మ‌హేష్ అభిమానుల్ని ఖుషీ చేయాల‌ని భావిస్తోంది. అయితే.. టీజ‌ర్ క‌ట్ చేసేంత ఫుటేజీ.. అందుబాటులో లేద‌ని టాక్‌. `స‌ర్కారు వారి పాట‌`కు సంబంధించిన కీల‌క‌మైన షెడ్యూల్ దుబాయ్‌లో సాగింది. 15 రోజుల పాటు జ‌రిగిన ఆ షెడ్యూల్ లో ఓ యాక్ష‌న్ ఘ‌ట్టాన్ని తెర‌కెక్కించారు. దాంతో పాటు 15 నిమిషాలకు స‌రిప‌డేంత ఫుటేజీ తెర‌కెక్కించారు. అది త‌ప్ప‌… `స‌ర్కారు వారి పాట‌` టీమ్ ద‌గ్గ‌ర టీజ‌ర్ కి స‌రిప‌డేంత ఫుటేజీ లేద‌ని తెలుస్తోంది. అందుకే 30 సెక‌న్ల‌ గ్లింప్స్‌ని క‌ట్ చేసి, అందులో ఓ డైలాగ్ ని మిక్స్ చేసి వ‌దులుదామ‌ని భావిస్తున్నారు. అది కూడా మ‌హేష్ ఓకే అంటేనే..?! 30 సెక‌న‌ల‌ గ్లింప్స్‌లో కిక్ లేద‌నుకుంటే.. ఆ టీజ‌ర్ కూడా బ‌య‌ట‌కు రాదు. చిన్నపాటి పోస్ట‌ర్ తో.. బ‌ర్త్ డే విషెష్ చెప్పేస్తారంతే. ప్ర‌స్తుతానికైతే 30 సెక‌న్ల బుల్లి టీజ‌ర్ అయితే క‌ట్ చేస్తున్నారు. దానికి మ‌హేష్ ఆమోద ముద్ర ప‌డాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close