బాల‌య్య కాంపౌండ్‌లోకి తేజ‌??

నంద‌మూరి బాల‌కృష్ణ‌… ఎప్పుడు ఎవ‌రికి అవ‌కాశం ఇస్తాడో ఊహించ‌డం చాలా క‌ష్టం. అందుకే ఆశ్చ‌ర్య‌పోయే కాంబోలు సెట్ అయిపోతుంటాయి. పూరి – బాల‌య్య కాంబో ఎవ్వ‌రూ ఊహించలేదు. సినిమాల‌కు దూరంగా ఉంటున్న బి.గోపాల్‌ని పిలిచి మ‌రీ అవ‌కాశం ఇచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు బాల‌య్య‌. ఇప్పుడు తేజ‌కీ ఊహించ‌ని ఆఫర్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల బాల‌య్య – తేజ మ‌ధ్య సినిమాకి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఒక‌ట్రెండు సార్లు ఇద్ద‌రూ భేటీ అయిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం బాల‌య్య ద‌గ్గ‌ర ఎన్టీఆర్ ఆత్మ‌క‌థ స్క్రిప్టు రూపంలో రెడీగా ఉంది. దాన్ని టేక‌ప్ చేసే ద‌ర్శ‌కుడి కోసం బాల‌య్య అన్వేషిస్తున్నాడు. ఈ విష‌యానికి సంబంధించి తేజ‌తో బాల‌య్య మంత‌నాలు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే తేజ ఇంకా త‌న నిర్ణ‌యం చెప్ప‌లేద‌ని స‌మాచారం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో `నేనే రాజు నేనే మంత్రి` రూపొందించాడు తేజ‌. అది మంచి హిట్ అయ్యింది. తేజ ఫామ్ లోకి వ‌చ్చాడు. అదే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌లో మ‌రో సినిమా చేయ‌డానికి కూడా తేజ అంగీక‌రించాడ‌ని స‌మాచారం. ఆ సినిమా వెంక‌టేష్‌తో ప‌ట్టాలెక్కే అవ‌కాశాలున్నాయి. మ‌రి బాల‌య్య ఆఫ‌ర్‌కి తేజ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close