మత్తయ్య విచారణకు రాకుంటే మరింత ముదురుతుంది!

తెలంగాణ తెలుగుదేశం లో మిగిలిన కీలక ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఇరుక్కుని ఉన్న ఓటుకు నోటు కేసులో మరొక ఇంపార్టెంట్‌ నిందితుడు జెరూసలెం మత్తయ్య. వ్యవహారం రచ్చకెక్కిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్‌లో షెల్టరు తీసుకుని… అక్కడిపోలీసులకు ఫిర్యాదు ఇచ్చి.. తెలంగాణ సర్కారు తనను బెదిరిస్తున్నదంటూ సంచలనం రేకెత్తించిన కీలక వ్యక్తి మత్తయ్య. తెలంగాణ సర్కారు వేధింపులు మీద హైకోర్టుకు వెళ్లి.. తనను అరెస్టు చేయడానికి వీల్లేదంటూ మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకుని ఇన్నాళ్లూ నిమ్మళంగా ఉన్నారు.

అయితే తాజాగా తెలంగాణ ఏసీబీ అధికారులు మత్తయ్యకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ‘చాలా వాస్తవాలు మీకు తెలిసి ఉంటాయి గనుక.. విచారణకు రావాలంటూ’ నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ఉత్తర్వులున్నాయి గనుక.. మిమ్మల్ని అరెస్టు చేయం అని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఓటుకు నోటు కేసు మళ్లీ మలుపులు తిరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

తెదేపా ఎమ్మెల్యేల కోసం ఆకర్ష పథకం కంటిన్యూ అవుతున్నప్పుడు జూబ్లీ హిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్‌ కూడా ఈ కేసులో అరెస్టు కాబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాలుగురోజులుగా అంతా ప్రశాంతంగా కనిపిస్తున్నది గానీ.. ఇప్పుడు మత్తయ్యకు నోటీసులు వెళ్లాయి.

కానీ ఆయన మాత్రం, కేసీఆర్‌ మళ్లీ ప్రతీకార చర్యలకు దిగుతున్నారని, కోర్టు ఆదేశాల్ని ధిక్కరించి తనకు నోటీసులు ఇస్తున్నారని, తాను నోటీసులు తీసుకున్నప్పటికీ విచారణకు వెళ్లే ప్రసక్తే లేదని మత్తయ్య అంటున్నారు. ఈ మేరకు ఆయన ఏపీ పోలీసుల నుంచి రక్షణ కూడా కోరుతున్నారు. పనిలో పనిగా ఏపీలో అప్పట్లో తెలంగాణ సర్కారు అధికారులు ఇరుక్కునేలా పెట్టిన ఫోను ట్యాపింగ్‌ కేసుల్ని కూడా తెరమీదకు తెస్తున్నారు. అయితే తెలంగాణ ఏసీబీ నోటీసుల ప్రకారం మత్తయ్య విచారణకు రాకపోతే గనుక.. వివాదం మరింతగా ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఏసీబీ దీనిని మరింత సీరియస్‌గా తీసుకనే అవకాశం ఉంది.

అయితే మత్తయ్య విచారణకు హాజరై సాంకేతికంగా జాగ్రత్తగా సమాధానలు ఇవ్వగలిగితే.. నిందితులకు లాభం జరగవచ్చుననే వాదనలు కూడా కొందరు న్యాయనిపుణులు చేస్తున్నారు. ముందుముందు ఈ వివాదం మరింత ముదిరే సంకేతాలు కనిపిస్తూ ఉండడంతో మత్తయ్య విచారణకు హాజరయ్యాడా? లేదా? అనేది చిన్న సంగతి గానీ.. తెదేపా ఎలా స్పందిస్తుందనేది కీలకంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close