తెలంగాణ అసెంబ్లీలో మూడు వారాల చర్చలు ఒక్క వారంలో పూర్తి..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించడానికి ఏమీ లేకుండా పోయింది. రోజు పరిమిత సమయంలోనే సభ నిర్వహిస్తున్నప్పటికీ.. ఆమోదించుకోవాల్సిన బిల్లులన్నీ ఆమోదం పొందాయి. దాంతో ఇక అసెంబ్లీని వాయిదా వేయడం మంచిదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చేసింది. మామూలుగా అయితే వర్షాకాల సమావేశాలు సుదీర్ఘంగా సాగుతాయి. అందుకని.. సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించారు. మొదటి రోజు బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో ఇరవై ఎనిమిదో తేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించారు.

అవసరం అయితే ఇంకా పొడిగిస్తామని… కీలకమైన అంశాలపై చర్చిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున లఘు చర్చకు 16 అంశాలను ప్రతిపాదించారు. కరోనా ఉధృతి, బీసీ సబ్‌ప్లాన్‌, ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 203 జీవో, శ్రీశైలం పవర్‌ ప్రాజెక్టులో ప్రమాదం, నిరుద్యోగం, సంక్షేమం, వ్యవసాయం వంటి అంశాలపై చర్చించేందుకు అంగీకరించారు. అయితే ఈ అంశాలన్నింటిపై వారం రోజుల్లో చర్చ ముగిసిపోయింది. రెవిన్యూ చట్టం కూడా ఆమోదం పొందింది.

పీవీకి భారత తర్న ఇవ్వాలన్న తీర్మానం చేశారు. కొత్త విద్యుత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం కూడా చేశారు. బిల్లులన్నీ ఆమోదం పొందటంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కృష్ణాజలాలు, పోతిరెడ్డిపాడు, సంక్షేమంపై చర్చించాల్సి ఉందని… సమావేశాలు కొనసాగించాలని కాంగ్రెస్ నేతలు కోరినా.. పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. బుధవారం తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close