తెలంగాణ డీజీపీకి హెచ్చరిక పంపిన బీజేపీ !

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఏపీకి పంపిస్తామని బండి సంజయ్ .. టెన్త్ పేపర్ లీక్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టారని.. ఈ కేసు విషయంలో ఇంతటితో వదిలి పెట్టబోమని హెచ్చరించారు. బండి సంజయ్ అరెస్టుపై కేంద్ర పెద్దలు కూడా అగ్రహించారన్న ప్రచారం జరిగింది. తెర వెనుక ఏం జరిగిందో కానీ.. తెలంగాణ హైకోర్టులో కేంద్రం ఓ పిటిషన్ వేశారు. విచారణ పెండింగ్‌లో ఉన్న సివిల్ సర్వీస్ అధికారుల క్యాడర్ వివాదంపై పిటిషన్ ను త్వరగా పరిష్కరించాలని పిటిషన్‌లో కోరింది. దీంతో ఈ పిటిషన్ పై విచారణను జూన్‌లో చేపడతామని హైకోర్టు తెలిపింది.

తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న 12 మంది అధికారుల బదిలీలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ క్యాడర్‌‌కు చెందిన 12 మంది ఆలిండియా సర్వీస్ ఆఫీసర్లు క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో తెలంగాణలో పని చేస్తున్నారు. వీరిలో తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్ ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. తెలంగాణ ఇన్ చార్జ్ డీజీపీ అంజనీకుమార్ సహా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులపై విచారణను తెలంగాణ హైకోర్టు కొన్నాళ్ల కిందట వాయిదా వేసింది. మళ్లీ విచారణకు రాకపోయేసరికి కేంద్రం త్వరగా విచారణ చేయాలని పిటిషన్ దాఖలు చేసింది.

సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన తీర్పు మెరిట్ ప్రకారం చూస్తే అందరూ ఏపీకి వెళ్లాల్సి వస్తుందన్న అభిప్రాయ అధికారవర్గాల్లో ఉంది. అయితే విచారణను జూన్‌లో చేపడతామని హైకోర్టు చెప్పడంతో మరో రెండు నెలల వరకూ ఈ అంశంలో ఎలాంటి కదలిక ఉండకపోవచ్చు. కానీ ఈ అధికారుల్లో మాత్రం దడ ప్రారంభమవుతుంది. రాజకీయ పరమైన విషయాల్లో బీజేపీకి వ్యతిరేకంగా దూకుడుగా వెళ్తే ఏమైనా జరగవచ్చన్న ఆందోళన వారిలో ఉంటుంది. బీజేపీ ఖచ్చితంగా ఇదే ఎఫెక్ట్ కోరుకుంటుందన్న అభిప్రాయం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close