తెలంగాణ బడ్జెట్ రూ. లక్షా 30వేల కోట్లే..!

కరోనా దెబ్బకు తెలంగాణ బడ్జెట్ రూ. 50వేల కోట్లు తగ్గిపోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక స్థితి… బడ్జెట్.. ఇతర శాఖలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. పడిపోయిన ఆదాయానికి తగ్గట్లుగా బడ్జెట్‌ను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలవి మాలిన అప్పులు చేసి తిప్పలు పడటం కంటే… బడ్జెట్‌ను తగ్గించుకోవడం మంచిదన్న అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. గత మార్చిలో 2020-21 ఏడాదికి రూ.1.82 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్‌ను ఆమోదించారు. అప్పట్లో ఆదాయాలను వాస్తవికంగానే అంచనా వేశారు. గతంలో రెండు లక్షల కోట్లకు దాటిపోయిన అంచనాలను తగ్గించారు.

అయితే వాస్తవిక అంచనాలను కూడా కరోనా మరింత కుందదీసింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రాష్ట్ర ఖజానాకు వచ్చిన ఆదాయం రూ. 55,782 కోట్లు మాత్రమే. పైగా ఇందంులో రూ.24,719 కోట్లు రుణాలు.ఆదాయంలో 40 శాతానికి పైగా అప్పుల ద్వారా వచ్చినవే. ఖర్చు రూ.53,313 కోట్లుగా లెక్క తేలింది. అయితే మొదటి ఆరు నెలల కాలంలో అత్యధికం లాక్ డౌన్‌లో ఉంది. దీంతో వ్యాపార వ్యవహారాలు.. కార్యకలాపాలు జరగలేదు. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడింది. వచ్చే ఆరు నెలల్లో అంచనా వేసిన ఆదాయం వస్తుందని.. అధికారులు భావిస్తున్నారు. భూము ల విక్రయం ద్వారా రూ.30 వేల కోట్ల మేర సమకూర్చుకోవాలని బడ్జెట్‌లో నిర్ణయించారు కానీ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. వచ్చే ఆరు నెల్లో రూ.70 వేల కోట్ల మేర ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులోనూ ఓ రూ. ఇరవై వేల కోట్ల వరకూ అప్పులు ఉండవచ్చు. ఎలా చూసినా.. మొత్తం బడ్జెట్‌ రూ.1.30 లక్షల కోట్లకే పరిమితం అవుతుంది.

ఫ్లాగ్ షిప్ పథకాలకు మాత్రం నిధులు పైసా తగగ్కుండా కేటాయించాలని అనుకుంటున్నారు. పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యాసంగికి సంబంధించిన రైతుబంధు నిధులను చెల్లించాల్సి ఉంది. వీటన్నింటికీ నిధులు సర్దుబాటు చేస్తూ..ఇతర రంగాలకు కోత విధించే అవకాశం ఉంది. దీనిపై కేసీఆర్ రెండు రోజుల పాటు సమీక్షలు చేసి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close