తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం కాదే..!? ఇంత మార్పు ఎలా..?

సెప్టెంబర్ 6వ తేదీ..

తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారు. ముహుర్తం ప్రకారం రద్దు చేసి.. నిమిషాల్లోనే తెలంగాణ భవన్‌కు వచ్చి అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆయన దూకుడు చూసి.. అది ప్రతిపక్షాలపై చేసిన సర్జికల్ స్ట్రైక్స్‌గా అందరూ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కానీ.. ఇతర పార్టీలు కానీ కోలుకునే ప్రశ్న లేదనుకున్నారు. పైగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏక నాయకత్వం లేదు. బహునాయకత్వం ఉంది. ఒకరి మాట ఒకరు వినరు. ఎడ్డెం అంటే తెడ్డెం అంటారు. అలాంటి పార్టీ .. కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్ నుంచి కోలుకుంటుందని.. ఎదురుదాడికి దిగుతుందని .. ఎవరూ అనుకోలేదు. సింపుల్‌గా చేతులెత్తేస్తుందని అనుకున్నారు.

నవంబర్ లాస్ట్ వీక్..!

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాకూటమి … తెలంగాణ రాష్ట్ర సమితి సర్కారుకు గట్టి పోటీ చేస్తోంది. చాలా మందికి రూట్‌లెవల్‌లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రజల అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకోరు. కానీ ఇప్పుడు.. ప్రజాభిప్రాయం ప్రజాకూటమి వైపు ఉందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఓ సూపర్ హిట్ సినిమాకు మౌత్ టాక్ ఎలా ఉపకరిస్తుందో.. ప్రస్తుతం ప్రజాకూటమికి ఈ మౌత్ టాక్ అలా పని చేస్తోంది.

రెండున్నర నెలల్లో ఇంత మార్పు ఎలా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతపై వ్యతిరేకత ఉంది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు.. ఇతర నేతలకూ తెలుసు. కానీ.. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలన్నదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. ఒకరి ఆలోచనలకు మరొకరు సహకరించే పరిస్థితి లేదు. అయితే.. ఎప్పుడైతే..అన్ని పార్టీలను కలిపి.. మహాకూటమిగా ఏర్పడి పోటీ చేయాలన్న ప్రతిపాదనను గట్టిగా ముందుకు తీసుకెళ్లారో.. అక్కడే.. ప్లస్ పాయింట్ పడింది. నాలుగు పార్టీలు కలసి పోటీ చేసినా.. పెద్దగా విబేధాలు రాకుండా… కేసీఆర్ వ్యతిరేకులందర్నీ.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ… సమీకరించగలిగేలా… కాంగ్రెస్ పార్టీ నేతలు.. ప్లాన్డ్ గా వ్యవహరించలిగారు.

తెలంగాణ పరిస్థితిని ఎప్పటికప్పుడు… అధ్యయనం చేసిన కాంగ్రెస్ హైకమాండ్ కూడా.. పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. టిక్కెట్ల విషయంలో.. కానీ సీనియర్ నేతలు అసంతృప్తికి గురి కాకుండా.. సర్దిచెప్పడంలోనూ.. చురుకుగా వ్యవహరించింది. అనుకున్నది ఇవ్వకపోతే.. ఎంత రచ్చ అయినా చేసే కోమటిరెడ్డి బ్రదర్స్‌ అడిగినవి ఇచ్చి సర్ది చెప్పడం దగ్గర్నుంచి.. టిక్కెట్లు ఆశించి భంగపడ్డ రెబెల్స్ ను బుజ్జగించడం వరకూ… చాలా పెద్ద స్థాయిలో ప్రయత్నాలు చేసింది. చివరకు కర్ణాటక మంత్రి.. తిరుగులేని వ్యూహకర్తగా ఉన్న డీకే శివకుమార్ సేవల్ని కూడా ఉపయోగించుకుంది.

కాంగ్రెస్ హైకమాండ్ కానీ… ఆ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు కానీ.. ఇటీవలి కాలంలో ఇంత బ్యాలెన్స్‌డ్‌గా.. తమ పార్టీ పరిస్థితిని .. సమన్వయంతో మెరుగుపర్చుకున్న సందర్భాలు లేవు. గెలుపు ముంగిట ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కూడా.. విజయాన్ని బీజేపీకి అప్పగించారు. కానీ.. తెలంగాణలో మాత్రం.. రాజకీయ చతురత చూపిస్తున్నారు. ఆశల్లేవనుకున్న పరిస్థితి నుంచి పోరాటం ప్రారంభించారు. ప్రజలకు ప్రత్యామ్నాయం ఉందన్న భావన తీసుకు రాగలిగారు. ఈ విషయంపై .. ప్రజల్లో స్పష్టమైన అభిప్రాయం ఉంది. మరి దీన్ని.. చివరి వరకూ తీసుకెళ్లగలరా..? కేసీఆర్ క్షణక్షణానికి మార్చే రాజకీయానికి గట్టి కౌంటర్లు ఇవ్వగలరా..? అన్నదే ముందు ముందు ఫలితాల్ని తేల్చబోతోంది.

–సుభాష్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close