పింఛెన్ల‌తో ఓటు బ్యాంకు పెంచే ఉత్త‌మ్‌ వ్యూహం!

తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వం ఈ మ‌ధ్య సంక్షేమ కార్య‌క్ర‌మాల‌పై మ‌రింత శ్ర‌ద్ధ పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున ల‌బ్ధిదారుల‌కు పించెన్లు అందిస్తోంది. అయితే, టి. కాంగ్రెస్ లెక్క ప్ర‌కారం… ఈ పింఛెనుదారులందరినీ తెరాస ఓటు బ్యాంకుగా చూస్తోంది. ఏదైతే కేసీఆర్ కి బ‌లం అవుతోందో, దాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంపై దృష్టిపెడుతోంది. ఇదే అంశమై మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి నేతృత్వంలో ఒక క‌మిటీ ఇటీవలే నివేదిక తయారు చేసి, పీసీసీ ముందుంచింది. పింఛెన్ దారుల‌ను పెద్ద ఎత్తున ఆక‌ర్షించ‌గ‌లిగితే… ఓటు బ్యాంకును అనూహ్యంగా పెంచుకోవ‌చ్చ‌నే అంచ‌నాకి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని నేత‌లు ఓ వ్యూహం సిద్ధం చేశారు.

ప్ర‌స్తుతం 65 ఏళ్లు నిండిన‌వారికే కేసీఆర్ స‌ర్కారు వృద్ధాప్య పింఛెను ఇస్తోంది. ఈ వ‌యసు 58కి త‌గ్గించాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింది. తాము అధికారంలోకి వ‌స్తే 58 నిండిన‌వాళ్లంద‌రికీ ఓల్డేజ్ పెన్ష‌న్ వ‌స్తుంద‌ని హామీ ఇవ్వ‌నున్నారు. దీంతో ఆ ఓటు బ్యాంకు త‌మ‌కు అనుకూలంగా మారుతుంద‌ని భావిస్తున్నారు. అంతేకాదు, ప్ర‌స్తుతం తెరాస ఇస్తున్న పెన్ష‌న్ రూ. 1000ని రూ. 2000ల‌కు పెంచ‌బోతున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. విక‌లాంగుల పెన్ష‌న్ల ప్ర‌స్తుతం రూ. 1500 ఇస్తోంది కేసీఆర్ స‌ర్కారు. దీన్ని కూడా రెండింత‌లు చేస్తామ‌ని ఉత్త‌మ్ అంటున్నారు. వీరితోపాటు చేనేత కార్మికులు, ఇత‌ర చేతి వృత్తుల వారికి ప్ర‌స్తుతం ఇస్తున్న పెన్ష‌న్ల‌ను డబుల్ చేస్తామ‌న్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు… ఇలా అంద‌రికీ పెన్ష‌న్ల‌ను భారీగా పెంచుతామ‌ని ఉత్త‌మ్ హామీ ఇచ్చారు.

తెలంగాణ‌లో టీపీసీసీలోగానీ, ఇత‌ర చోట్ల‌గానీ నిరుద్యోగులుగా న‌మోదు అయిన‌వారి సంఖ్య 15 ల‌క్ష‌ల‌కు పైచిలుకు ఉంద‌నీ, వీరిలో కొన్ని అర్హ‌త‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ప‌ది ల‌క్ష‌లమంది నిరుద్యోగ యువ‌త‌కు నెల‌కు రూ. 3 వేల నిరుద్యోగ‌భృతి ఇస్తామ‌ని ఉత్త‌మ్ హామీ ఇచ్చారు! తాము అధికారంలోకి రాగానే ఓప‌క్క పెద్ద ఎత్తున ప్ర‌భుత్వోద్యోగాల నియామ‌కాలు చేప‌డుతూనే, ఇంకోప‌క్క ఈ కార్య‌క్ర‌మం కూడా ఉంటుంద‌ని ఉత్తమ్ చెప్పారు. మొత్తానికి, పెన్ష‌న్ల‌నే ప్ర‌ధానాస్త్రంగా మార్చుకునేందుకు ఉత్త‌మ్ వ్యూహాత్మ‌కంగా హామీలు ఇస్తున్నారు. వీటినే ప్ర‌ధాన ప్ర‌చారాస్త్రాలుగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నారు. ఈ హామీలు క‌చ్చితంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన‌వే. కాక‌పోతే, కాంగ్రెస్ ఇవ్వ‌బోతున్న ఈ హామీల‌కు ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంద‌నేదే చూడాలి. దీనికి ధీటుగా కేసీఆర్ కూడా ఏదో ఒక‌టి చేస్తారు క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close