జగ్గారెడ్డి కేసు తీగ లాగితే ఇరుక్కునేది ఎవరు..?

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డిని ఎవరి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు..? ఎవరూ ఫిర్యాదు చేయలేదు.. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అరెస్ట్ చేశారు. 14 ఏళ్ల కిందటి కేసుపై ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారని..న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు పోలీసుల వద్ద సమాధానం లేకపోయింది. జగ్గారెడ్డి అరెస్ట్‌తో అసలు కేసు ఏమిటన్న విషయం ఒక్కసారిగా హైలెట్ అయింది. పీసీసీ చీఫ్ .. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కేసుకు సంబంధించి కొన్ని వివరాలు బయటపెట్టారు. 2007లో నమోదైన హ్యూమన్ ట్రాఫికింగ్, నకిలీ పాస్‌పోర్ట్ కేసులో… అప్పట్లో రషీద్ ఖాన్ ఇచ్చిన వాగ్మూలంలో జగ్గారెడ్డి పేరు లేదు. రషీద్ ఖాన్ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉత్తమ్ బయపెట్టారు.

అందులో ప్రధానంగా కేసీఆర్, హరీష్ రావుల పేర్లు ఉన్నాయి. హరీష్ రావు కుటుంబసభ్యుల పేర్లతో… ఇప్పటికీ అమెరికాలో కొంత మంది ఉన్నారని ఉత్తమ్ చెబుతున్నారు. జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినట్లు.. కేసీఆర్, హరీష్‌లను అరెస్ట్ చేస్తారా అని పోలీసులను ఆయన ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కనుసన్నల్లోనే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని.. అప్పట్లో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారితో కేసీఆరే ఈ స్కాం నడిపించారంటున్నారు. ఆ కేసు మొత్తం బయటకు తీస్తే.. టీఆర్ఎస్ సభ్యుల చుట్టూనే తిరుగుతోంది.

అనూహ్యంగా ఈ కేసు ఇప్పుడు బయటకు తీయడం.. టీఆరెఎస్ వర్గాలను ఆశ్చర్య పరించింది. ఇలాంటి కేసు ఒకటి ఉందన్న విషయం అందరూ మర్చిపోయిన తర్వాత.. నేరుగా తమ పేర్లు వినిపించిన కేసును బయటుక తీయడం… ఆత్మహత్యాసదృశ‌యమేని కొంత మంది నేతలు ఆందోళన చెందుతున్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. అధికారం మారినప్పుడు… వచ్చే ప్రభుత్వం ఇలాంటి కేసుల్ని చూపించి అడ్వాంటే తీసుకుంటుందని … వారు ఆందోళన చెందుతున్నారు. రికార్డుల్లో ఉన్న నిందితుని వాంగ్మూలంలో కేసీఆర్, హరీష్ పేర్లు ఉన్నాయి… కాబట్టి.. ఇప్పుడు జగ్గారెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తర్వాత వచ్చే ప్రభుత్వం వ్యవహరిస్తే.. సమర్థించుకోవడానికి కూడా అవకాశం ఉండదనేది వాళ్ల వాదన. ఈ కేసును కేంద్రం తలుచుకుటే..సీబీఐ చేతుల్లోకి తీసుకోగలదు. కేంద్రం… బీజేపీ కాకుండా.. ఈ సారి వేరే ప్రభుత్వం వచ్చినా… ఇప్పుడు జగ్గారెడ్డిని టార్గెట్ చేస్తూ బయటకు తీసిన కేసు.. వారికి… బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇదే టీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే ఇలాంటి రిస్క్‌లు ఉంటాయని తెలియకుండానే కేసీఆర్ రాజకీయాలు చేయబోరని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com