ఎంఐఎంతో టచ్‌లోకి కాంగ్రెస్ ..! ఓవైసీ బ్రదర్స్ రెడీయేనా..?

తెలంగాణలో కౌంటింగ్‌కు ముదే రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. మజ్లిస్‌ను దూరం పెడితే.. తామే ప్రభుత్వానికి మద్దతిస్తామని.. భారతీయ జనతా పార్టీ కేసీఆర్‌కు ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గుంభనంగా.. ఓవైసీ బ్రదర్స్‌తో టచ్‌లోకి వెళ్లింది. టీఆర్ఎస్ విషయంలో మజ్లిస్‌కు మొదటి నుంచి కాస్త సందేహం ఉంది. తెలంగాణలో ముస్లింల ఓట్ల కోసం.. తమతో స్నేహం నటిస్తున్నా.. జాతీయ స్తాయి ప్రయోజనాల కోసం.. కేసీఆర్ కచ్చితంగా బీజేపీతోనే వెళ్తారన్న క్లారిటీ ఓవైసీ బ్రదర్స్‌కు ఉంది. అందుకే సిట్టింగ్ సీట్ల విషయంలో టీఆర్ఎస్ సహకారం ఉంటే చాలనుకుని.. వాటికే ఫిక్సయిపోయింది. ఇప్పుడు హంగ్ వచ్చే పరిస్థితి ఏర్పడటంతో.. ఓవైసీ బ్రదర్స్ కీలకం అవుతారన్న అంచనాల నేపధ్యంలో.. కాంగ్రెస్ పార్టీ.. కౌంటింగ్‌కు ముందుగానే చర్చలు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనలను ఓవైసీ ఖండించడం లేదు. ఇప్పుడేమీ స్పందించబోనని అంటున్నారు.

నిజానికి ఓవైసీ బ్రదర్స్‌లో పెద్దవాడైన అసదుద్దీన్.. టీఆర్ఎస్‌కు పూర్తి స్థాయిలో సహకరించారు. ఆయన జిల్లాల్లో కూడా… టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేశారు. కానీ అక్బరుద్దీన్ మాత్రం.. అన్న మాటలను అసలు పరిగణనలోకి తీసుకోలేదు. డిసెంబర్ పదకొండో తేదీన బాద్ షా అవుతానని లేదా బాద్ షా మేకర్‌ను అవుతానని.. పదే పదే ప్రకటలు చేశారు. కేసీఆర్ కాదు.. కదా.. ఏ సీఎం అయినా సరే తమ ముందు తల వంచాల్సిందేనని ప్రకటనలు చేశారు. దీంతో.. ఓవైసీ బ్రదర్స్ చెరో వాయిస్ వినిపిస్తున్నారంటే.. కచ్చితంగా… వాళ్లు ఎన్నికల తర్వాత ఏదో మ్యాజిక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది.

ఓవైసీ బ్రదర్స్ రాజకీయంలో.. ఎప్పుడూ ఒకరికి స్టిక్ అయిన సందర్భాలు లేవు. ఎవరు తమకు ఆర్థికంగా, రాజకీయంగా సహకరిస్తారో.. వారికే మద్దతుగా నిలుస్తారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో సన్నిహితంగా మెలిగి.. ఇతర చోట్ల అధికారంలో ఉన్న పార్టీలకు ముస్లిం ఓట్లు వచ్చేలా చేస్తామని అప్రకటిత ఒప్పందం చేసుకుని.. ఇంకెవరూ పాతబస్తీలోకి రాకుండా చూసుకుంటూ ఉంటారు., బీజేపీ సపోర్ట్ ఉన్న ప్రభుత్వానికి ఓవైసీ ఎలా సమర్థించినా.. అది ఆ పార్టీ బేస్‌కే దెబ్బ పడుతుంది. ప్రత్యామ్నాయం ఎవరు వచ్చినా.. మజ్లిస్ కనుమరుగవుతుంది. అందుకే.. బీజేపీ కన్నా.. కాంగ్రెస్ బెటర్ అనుకునే పరిస్తితి ఓవైసీలకు రావొచ్చు. ఏం జరుగుతుందనేది.. కౌంటింగ్ తర్వాత క్లారిటీ వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close