తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు..! ఏ పార్టీలు ఎక్కడున్నాయి..?

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ రానుంది. ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 19వ తేదీ వరకూ నామినేషన్లకు సమర్పణకు తుది గడువు ఉంది. ఇరవయ్యో తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 22వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరగుతుంది. ఒకే దశలో ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబర్ 11వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది. పూర్తి స్థాయి ఓటర్ల జాబితాపై ఇంకా రెడీ కాలేదు. 19 తేదీన ప్రకటిస్తామని… తెలంగాణ ఎన్నికల అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. మిగతా ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశారు.

ముందస్తుగా ఎన్నికలు తెచ్చిన పెట్టిన.. అధికార పార్టీ టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నహాలు చేసుకుంది. 107 మంది అభ్యర్థులతో … ఓ విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేయించారు. 107 మందికి బీఫారాలు కూడా పంపిణీ చేశారు. 15వ తేదీ నుంచి 70 నుంచి 80 సభల్లో ప్రసంగిస్తానని కేసీఆర్ కూడా ప్రకటించారు. ఓ పన్నెండు నియోజకవర్గాల్లో మాత్రం… అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. వాటికి ఉన్న లోపాయికారీ రాజకీయ సమీకరణాలు కలిసి వచ్చినప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. మరో వైపు… అధికార పార్టీని ఢీకొట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న మహాకూటమి ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. రెండు నెలల క్రితం మహాకూటమి ఏర్పాటు చేసుకున్నా ఇప్పటికీ.. సీట్లు, స్థానాలను ఖరారు చేసుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఫైనల్ చేసుకున్నా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉంది. మహాకూటమి పార్టీల మధ్య ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆదివారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయానికి వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ కోదండరాంతో భేటీ అయ్యారు. ఇదే సమయంలో తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణను కోదండరాం తన కార్యాలయానికి ఆహ్వానించారు. ఉత్తమ్‌తో జరుగుతోన్న చర్చల్లో రమణ కూడా ఉన్నారు. చివరికి సర్దుబాటు అయిపోయిందన్న సమచారాన్ని మాత్రం మీడియాకు ఇచ్చారు. బంగాల్‌ తరహాలో చట్టబద్ధమైన కమిటీ వేయాలని నిర్ణయించామన్నారు. ఈ కమిటీకి కోదండరామ్‌ను కన్వీనర్‌గా చేయాలనుకుంటున్నట్లు రమణ ప్రకటించారు. మరో వైపు సీపీఐతో ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస కృష్ణన్‌ సంప్రదింపులు జరిపారు. తెలిపారు. సఫలీకృతం అయినట్లు ప్రకటించారు. కానీ సీపీఐ ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సి ఉంది.

భారతీయ జనతా పార్టీ రెండు విడతలుగా అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ.. గట్టిగా పోటీలో ఉండేవారెవరో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఒంటరి పోరు అని ప్రకటించుకున్నా… యువ తెలంగాణ అనే పార్టీ పొత్తుల కోసం రాగానే… పెద్ద రిలీఫ్ ఫీలయిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఓ హగ్‌.. దానితో పాటు పది సీట్లు ఇచ్చేశారు. మిగతా అభ్యర్థులు కావాలంటే.. … మహాకూటమి అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత… ఆయా పార్టీల నుంచి వచ్చే వాళ్లు ఎవరైనా ఉంటే వారి కోసం ఆగాల్సిందే. ఇక బీఎల్ఎఫ్ అనే కూటమి కూడా పోటీ చేస్తోంది. ఇక జనసేన, వైసీపీలు… తాము పోటీ చేయడం లేదని ప్రకటించేశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close