ఆ ఏడున్నర శాతం పీఆర్సీ కూడా తూచ్..!?

తెలంగాణ ఉద్యోగులకు ఏడున్నర శాతం పీఆర్సీ ఇవ్వాలని బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. అరవై శాతం కావాలని డిమాండ్ చేశాయి. కొన్ని ఉద్యోగ సంఘాలతో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చర్చించారు. కానీ ఉద్యోగ సంఘాలన్నీ కేసీఆర్‌తో తేల్చుకుంటామని ప్రకటించాయి. అంతే.. ఆ తర్వాత అంతా సైలెంటయిపోయారు. అటు కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు వస్తారో తెలియదు. ప్రగతి భవన్‌ నుంచి ఎప్పుడు ఫామ్‌హౌస్‌కి వెళ్తారో తెలియదు. ఎప్పుడు ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతారో క్లారిటీ లేదు. కానీ ఈ లోపు మాత్రం పుణ్యకాలం మాత్రం గడిచిపోతోంది. పీఆర్సీ ఇప్పుడల్లా లేదనే సంకేతాలను ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు పంపుతోంది.

ఉద్యోగులు ఊహించనంత పీఆర్సీ ఇస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్లు ఊరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు.. కేసీఆర్ ఇస్తారని అనుకుంటున్నారు. పెద్దగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం లేదు. కానీ ఉద్యోగ సంఘాల ఈ నిర్లక్ష్యం వల్ల.. ప్రభుత్వం ఆ పిసరంత పీఆర్సీ ఇవ్వకపోయినా పోయిదేముందిలే అనుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించారు. కొన్ని కమిటీతో సీఎస్ సోమేష్ నేతృత్వంలోని కమిటీ చర్చించింది. ఇక నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ… సమర్పించలేదు.

ఇంకా ఇతర సంఘాలతోనూ చర్చిస్తామని తాజాగా.. ప్రభుత్వ వర్గాలు సమాచారాన్ని లీక్ చేశాయి. చర్చల ప్రక్రియ పేరుతో ఆలస్యం చేస్తున్నారన్న అనుమానాలు ఉద్యోగుల్లో ప్రారంభమయ్యాయి. ఆర్టీసీ సమ్మె సమయంలో యూనియన్లను నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయింది. సమ్మెకు దిగిన కార్మికులతోనే యూనియన్ లీడర్లపై విమర్శలు చేసే విధంగా చేసి విజయవంతమైంది. ఇప్పుడు ఉద్యోగుల విషయంలోనూ అదే ప్లాన్ కేసీఆర్ అమలు చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు అనుకుంటున్నారు. ఇప్పటికైతే ఉద్యోగ సంఘాల నేతల మధ్య రగడ సృష్టించి… టైం పాస్ చేస్తారని.. ఈ లోపు.. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్లు… ఇతర అడ్డంకులు వస్తాయని.. అందుకే.. పీఆర్సీ గురించి ఉద్యోగులు ఇప్పుడల్లా ఆశలు పెట్టుకోవడం అత్యాశేనన్న సెటైర్లు విపక్షాల నేతల నుంచి వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close