తెలంగాణ గవర్నర్‌కు “సెక్షన్ 8” ఆయుధం !

తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అనే రాజకీయం నడుస్తోంది. గవర్నర్ రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ అంటోంది. తాను ఎక్కడ రాజకీయం చేశానో చెప్పాలని గవర్నర్ అడుగుతున్నారు. ఇప్పుడు రాజకీయం చేయాలని ఆమె డిసైడయ్యాేమో కానీ ఢీల్లీలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ ఒరవడి ఆమె కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అలా చేయాలనుకుంటే గవర్నర్ చేతికి ఏ గవర్నర్‌కూ ఉండని ఓ ఆయుధం ముందుగానే లభిస్తుంది.  అదే సెక్షన్ 8.

హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని. పదేళ్ల పాటు… హైదరాబాద్‌కు సంబంధించిన అంశాల్లో.. గవర్నర్‌కు విశేషాధికారాలు కల్పిస్తూ.. విభజన చట్టంలో సెక్షన్ 8ను చేర్చారు. ఈ అధికారాలను గతంలో గవర్నర్ నరసింహన్ వాడుకునే ప్రయత్నం చేశారు కానీ.. కేసీఆర్ వాటిని చాకచక్యంగా ఆపేయగలిగారు. తర్వాత చంద్రబాబు.. సెక్రటేరియట్‌ను అమరావతికి మార్చుకోవడంతో.. సెక్షన్ 8 అనే పదానికి దాదాపుగా ముగింపు వచ్చేసినట్లయింది.  ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా ఆ సెక్షన్ ఎయిట్ గురించి ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లో  ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోవాలన్న గవర్నర్ అనుమతి తీసుకోవాలి.  సెక్షన్ 8 అంశం పూర్తిగా గవర్నర్ అధికారాలకు సంబంధించినది. ఇప్పుడు గవర్నర్.. ఆ సెక్షన్ ను ఉపయోగించుకోవాలని అనుకుంటే ప్రభుత్వానికి చిక్కులు తప్పవు. గతంలో సెక్రటేరియట్ భవనాలు కూల్చేసేటప్పుడు ఈ అంశంపై చర్చ జరిగింది. కాంగ్రెస్ నేతలు ఈ సెక్షన్ ను ఉపయోగించుకోవాలని గవర్నర్‌ను కోరారు. అప్పుడు తమిళిశై పట్టించుకోలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి రంగంలోకి దిగుతారేమో చూడాలి. అదే జరిగిదే.. తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close