మరో మూడు రోజులు స్టే..! కూల్చివేత.. ఆగితే సాగదు..!

తెలంగాణ సచివాలయం కూల్చివేతపై ఇచ్చిన స్టే ఆర్డర్స్‌ను.. హైకోర్టు మరో మూడు రోజులు పొడిగించింది. కూల్చివేయాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం కాపీని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల పాటు స్టే పొడిగిస్తూ.. పదిహేనో తేదీకి వాయిదా వేసింది. సచివాలయ కూల్చివేతపై.. మంత్రివర్గం జూన్‌ 30న నిర్ణయం తీసుకుందని … అడ్వకేట్ జనరల్ చెప్పిన సమయంలో.. దానికి సంబంధించిన పత్రాలు ఏవని ధర్మాసనం ప్రశఅనించింది. మంత్రివర్గ నిర్ణయం ప్రతిని సమర్పించకుంటే ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్‌నోట్‌ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. దీంతో.. వెంటనే… వాటిని సమర్పిస్తామని కోర్టుకు తెలిపారు.

గతంలో కూడా సచివాలయం కూల్చివేతకు వ్యతిరేకంగా పది పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు… సచివాలయం కూల్చివేతపై కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని చెబుతూ.. ఆ పిటిషన్లు కొట్టేసింది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రభుత్వం… రాత్రికి రాత్రే.. కూలగొట్టడం ప్రారంభించింది. మళ్లీ అనూహ్యంగా.. కొత్తగా కూల్చివేతలపై పిటిషన్లు వేయడంతో.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పుడు.. ఏ కేబినెట్ నిర్ణయాన్ని తప్పు పట్టలేమని.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో.. అదే కేబినెట్ నిర్ణయం ఫిజికల్ కాపీని కోర్టు ముందు ఉంచాలని అడగడం ఆసక్తికరంగా మారింది.

మూడు రోజుల తర్వాత అయినా.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ వస్తుందని.., తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మరో వైపు సుప్రీంకోర్టులోనూ.. ఈ అంశంపై.. పిటిషన్ దాఖలయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. పిటిషన్ వేసి.. కూలగొట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు తీర్పుపై స్టే కోరారు. ఈ మూడు రోజుల్లో.. ఆ పిటిషన్ పై స్టే వచ్చినా… లేకపోతే.. పిటిషనర్.. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా.. ప్రభుత్వానికి… కూల్చివేత బుల్ డోజర్లకు మరికొంత కాలం విశ్రాంతి తప్పదని భావిస్తున్నారు. శరవేగంగా కూల్చివేత చేపట్టినా.. మధ్యలో ఆగిపోవడం… తెలంగాణ ప్రభుత్వ పెద్దలను బాగా ఇబ్బంది పెడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

3 రాజధానులకు 16నే ముహుర్తం..! ప్రధానికి ఆహ్వానం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్లుగానే మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆహ్వానించింది. ప్రభుత్వం తరపున రాజధాని తరలింపు వ్యవహారాలన్నీ పర్యవేక్షిస్తున్న సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి...

మంటల్లో బెజవాడ కోవిడ్ ఆస్పత్రి..! రోగుల ప్రాణాలు పణం..!

మొన్న గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగి. రోగులు మరణించిన విషయం కలకలం రేపింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఏపీలో జరిగింది. విజయవాడలో.. కోవిడ్ చికిత్స ఆస్పత్రిగా వినియోగిస్తున్న స్వర్ణా...

ఆర్కే పలుకు : జగన్‌ మెడకు ఈశ్వరయ్యను చుడుతున్న ఆర్కే..!

న్యాయవ్యవస్థపై జగన్ చేస్తున్న దాడిని తనదైన శైలిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు... ఆంధ్రజ్యోతి ఆర్కే చేస్తున్న ప్రయత్నానికి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య ఆయుధాన్ని అందించారు. జస్టిస్ నరసింహారెడ్డిపై పోరాటం చేస్తున్న దళిత జడ్జి...

50మంది అతిథులు.. 200 కుటుంబాల‌కు లైవ్‌లో

రానా - మిహిక‌ల పెళ్లి అత్యంత సింపుల్‌గా, ప‌రిమిత‌మైన బంధుమిత్రుల స‌మ‌క్షంలో, క‌రోనా ఆంక్ష‌ల మ‌ధ్య జ‌రిగిపోయింది. కొద్దిసేప‌టి క్రిత‌మే.. జిల‌క‌ర్ర - బెల్లం తంతు ముగిసింది. ఇప్పుడు రానా - మిహిక‌లు...

HOT NEWS

[X] Close
[X] Close