తెలంగాణ డీజీపీ ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ.. ఫుల్ అడిషనల్ చార్జ్ హోదాలో డీజీపీగా ఉన్నారు. ఆయన నియామకం చెల్లుబాటు కాదని ఒకరు హైకర్టులో పిల్ వేయడంతో విచారణ జరిపిన హైకోర్టు ఈ నిర్ణయం ప్రకటించింది.
నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ పదవి ఖాళీ అవ్వడానికి మూడు నెలల ముందే అర్హులైన సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీ కి పంపాలి. యూపీఎస్సీ ఆ జాబితాలో నుంచి ముగ్గురు అధికారుల పేర్లను ఎంపిక చేసి రాష్ట్రానికి పంపుతుంది. ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా నియమించాలి. నియామకమైన అధికారికి కనీసం రెండేళ్ల పదవీ కాలం ఉండాలి. ఒకవేళ ఆ లోపు ఆయన రిటైర్ కావాల్సి ఉన్నా, రెండేళ్లు పూర్తయ్యే వరకు కొనసాగించేలా ఫిక్స్డ్ టెన్యూర్ ఇవ్వాలనేది ప్రధాన నిబంధన.
అయితే కొన్నాళ్లుగా ప్రభుత్వాలు ఇలా యూపీఎస్సీ ద్వారా నియామకాలు చేయకుండా.. ఫుల్ అడిషనల్ చార్జ్ ఇచ్చి తమకు కావాల్సిన వారిని నియమించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో.. జగన్ హయాంలో డీజీపీలు అలా ఉన్నవారే. ఇప్పుడు తెలంగాణలో శివధర్ రెడ్డి సీనియరే. ఆయన బ్యాచ్ కు చెందిన నలుగురు ఐపీఎస్లు ఉన్నారు. వారిలో శివధర్ రెడ్డిని రేవంత్ ఎంపిక చేసుకున్నారు. యూపీఎస్సీ ఎంపిక చేసినా.. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేస్తుంది. సమస్య ఉండదు. తర్వాత సీనియర్ అధికారులలో సీవీ ఆనంద్ డీజీపీ రేసులో ముందు ఉంటారు.
