ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా తెలంగాణ జర్నలిస్టు..!?

ఆంధ్రప్రదేశ్ సర్కార్.. మరో వివాదాస్పద నియామకానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన రామచంద్రమూర్తికి.. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు.. ప్రక్రియ ప్రారంభించినట్లుగా.. అధికారవర్గాలు చెబుతున్నాయి. నిన్నామొన్నటి వరకూ.. రామచంద్రమూర్తి.. సాక్షి గ్రూప్‌లో ఎడిటోరియల్ డైరక్టర్‌గా ఉన్నారు. ఏమైందో కానీ.. ఇటీవలి కాలంలోనే ఆయనతో రాజీనామా తీసుకున్నారని చెబుతున్నారు. అయితే.. ఆ రాజీనామా వెనుక అసలు కారణం… ఆయనకు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వడమేనని… తాజాగా… వస్తున్న వార్తలను బట్టి తెలుస్తోంది. సాక్షి పేరోల్స్‌లో ఉన్న ఉన్నతాధికారులకు.. ఏపీ సర్కార్ జీతాలతో… సలహాదారులు.. ఇతర నామినేటెడ్ పోస్టుల్లో నియమించుకోవడం.. కామన్‌గా జరుగుతోంది. ఆ కోవలో రామచంద్రమూర్తికి ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్టు ఇచ్చి… సాక్షికి భారం తగ్గించుకునే ప్రక్రియనేనన్న విమర్శలు వస్తున్నాయి.

రామచంద్రమూర్తిగా పదవి ఇస్తే.. సాక్షి ఉద్యోగులకు.. సర్కార్ జీతాలనే వివాదం మాత్రమే కాదు.. తెలంగాణ వారికి పెద్ద పీట అనే మరో వివాదం కూడా.. పెరగనుంది. ఇప్పటికే ఏపీ సర్కార్‌లో తెలంగాణ వారి ప్రాబల్యం అధికంగా ఉంది. ముఖ్యంగా ఐ అండ్ పీఆర్‌లో.. వాళ్లే తిష్టవేసినట్లుగా.. సెక్రటేరియట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఐ అండ్ పీఆర్‌ కమిషనర్‌గా… నల్లగొండ జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఏపీకి పిలిపించారు. కమ్యూనికేషన్స్ సలహాదారుగా ఖమ్మం జిల్లాకు చెందిన కృష్ణమోహన్, జాతీయ మీడియా సలహాదారుగా వరంగల్‌కు చెందిన దేవులపల్లి అమర్ లను నియమించారు. పీఆర్వో విభాగంలోనూ పలువురు తెలంగాణ వాసులకు అవకాశం లభించిందని చెబుతున్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతున్న రామచంద్రమూర్తి ఖమ్మమం జిల్లాకు చెందిన వారు.

ప్రతీ అంశంలోనూ.. తెలంగాణ వారికే ఏపీ సర్కార్ పెద్ద పీట వేస్తోందనే ఆరోపణలు… ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అధికారుల్ని.., డిప్యూటేషన్ పై తెచ్చుకోవడం.. ఏపీకి చెందిన అధికారుల్ని లూప్‌లైన్‌కి పంపడం వంటివి ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో… రామచంద్రమూర్తికి పదవి ఇవ్వడం అంటే… ఆ చర్చను.. మరో రేంజ్‌కు తీసుకెళ్లినట్లే అవుతుంది. అయితే.. జగన్ నిర్ణయం తీసుకుంటే.. ఎవ్వరి మాటా వినరు కాబట్టి… రామచంద్రమూర్తికి.. పదవి ఖాయమనే ప్రచారం వైసీపీలో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

నినాదాలు చేస్తే సస్పెండ్ చేస్తారా..?

ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేసిన విద్యార్థులను సస్పెండ్ చేసింది ఆదిత్య విశ్వవిద్యాలయం. ఈమేరకు సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ అధికారులు.. సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close