కీల‌క అంశాల‌తో మహా కూటమి ఉమ్మ‌డి డ్రాఫ్ట్ సిద్ధం..!

మ‌హా కూట‌మిలో కీల‌క పార్టీల నేత‌లు మ‌రోసారి స‌మావేశం అయ్యారు. బుధ‌వారం హైద‌రాబాద్ లో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఉమ్మ‌డి మేనిఫెస్టోపై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ఈ స‌మావేశానికి కాంగ్రెస్ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, సాంబ‌శివ‌రావు, దిలీప్ కుమార్, రావుల చంద్రశేఖర్ త‌దిత‌రులు హాజ‌రయ్యారు. అంశాలవారీగా ఈ స‌మావేశంలో పార్టీల మధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. అనంత‌రం మీడియాతో మాట్లాడిన టీజేఎస్ దిలీప్‌… ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌కు సంబంధించి డ్రాఫ్ట్ సిద్ధం చేశామ‌ని చెప్పారు. దీన్లో నీళ్లు, నిధులు, నియామ‌కాల‌కే ప్రాధాన్య‌త క‌ల్పించామ‌న్నారు. మ‌హాకూట‌మి అధికారంలోకి రాగానే ఏడాదిలోపుగా ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీ, ఏక‌కాలంలో రూ. 2 ల‌క్ష‌ల రైతు రుణమాఫీ, సాగునీటి ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ… వీటిని ఉమ్మ‌డి మేనిఫెస్టోలో ప్ర‌ధానాంశాలుగా పేర్కొంటామ‌ని చెప్పారు.

మ‌హా కూట‌మిలోని నాలుగు ప్ర‌ధాన పార్టీలూ విడివిడిగా మేనిఫెస్టోలు త‌యారు చేసుకుని వ‌చ్చారు. అనంత‌రం వాట‌న్నింటినీ క్రోడీక‌రించి ఉమ్మ‌డి ప్ర‌ణాళిక త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించారు. నాలుగు పార్టీలూ వారి మేనిఫెస్టోల‌ను ఇత‌ర పార్టీల‌తో ప‌ర‌స్ప‌రం పంచుకున్నారు. ఈ స‌మావేశంలో సిద్ధం చేసిన ముసాయిదాని పార్టీల అధ్య‌క్షుల‌కు పంపుతామ‌ని సీపీఐ నేత సాంబ‌శివ‌రావు చెప్పారు. మ‌హా కూట‌మికి ప్ర‌త్యామ్నాయంగా రెండు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. ‘తెలంగాణ ప‌రిర‌క్ష‌ణ వేదిక’ పేరును పెట్టే అవ‌కాశం ఉంద‌నీ తెలుస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే తెరాస ప్ర‌చార హోరును పెంచుతున్న నేప‌థ్యంలో మ‌రింత వేగంతో తాము కూడా ప్ర‌చారం చేయ‌బోతున్నామ‌ని భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. గురువారం నుంచే కాంగ్రెస్ ప్రచారం ప్రారంభిస్తోంద‌న్నారు. అయితే, ఇంకోప‌క్క మ‌హా కూట‌మి స‌మావేశాలు జ‌రుగుతూనే ఉంటాయ‌నీ, వ్యూహమంతా వీలైనంత త్వ‌ర‌గా ఖ‌రారు చేసి, ఉమ్మ‌డి వేదిక‌ను ఏర్పాటు చేసుకుని కూట‌మి పార్టీల‌తో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసుకుంటామని నేత‌లు చెబుతున్నారు.

ఇక‌, మ‌హాకూట‌మిలో కీల‌కమైన సీట్ల స‌ర్దుబాటు వ్య‌వ‌హారం ఓ కొలీక్కి రావ‌డానికి కూడా కొంత స‌మ‌యం ప‌ట్టేలానే క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన త‌రువాత‌నే ఈ చ‌ర్చ ఉంటుంద‌ని నేత‌లు అంటున్నారు. మొత్తానికి, మ‌హా కూట‌మి మేనిఫెస్టో, సీట్ల స‌ర్దుబాటు, ప్ర‌చార వ్యూహం, అజెండా… ఇలా అన్నీ పూర్తి కావాలంటే మ‌రోవారం రోజులు ప‌డుతుంద‌నే అనిపిస్తోంది. ఈలోగా మ‌రో రెండు, లేదా మూడుసార్లు కూట‌మి పార్టీల మ‌ధ్య స‌మావేశాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని కొంత‌మంది నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close