తెలకపల్లి వ్యూస్: దిగివచ్చిన హరీష్‌ రావు?

దేశంలో చాలా ప్రభుత్వాలకు భూసేకరణ సమస్యే రాజకీయ గండంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ స్వంత నియోజకవర్గమైన గజ్వేల్‌ పరిధిలో మల్లన్న సాగర్‌ కోసం భూమి సేకరించాలనే ప్రయత్నం కొండ కిష్టాపూర్‌తో సహా నాలుగు గ్రామాల్లో పూర్తిగా ప్రతిఘటనను ఎదుర్కొంటున్నది. 2013 భూ సేకరణ చట్టం పక్కన పెట్టి తాము ఏకపక్షంగా జారీ చేసిన 123 జీవో ప్రకారం భూములు తీసుకోవడం అన్నాయమని రైతులు ప్రతిపక్ష నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ కమ్యూనిస్టులు రైతు సంఘాలు జెఎసి నేత కోడండ రామ్‌ ప్రభృతులు ఈ ఆందోళనను బలపర్చారు. టిటిడిపి నేత రేవంత్‌ రెడ్డి నిరాహారదీక్ష తలపెట్టారు. మొదట్లో ఈ ఆందోళనను ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేసి ఎదుర్కొవాలని టిఆర్‌ఎస్‌ ప్రయత్నించింది. అందులో భాగంగా మల్లన్న సాగర్‌ పరిరక్షణ సమితి పేరిట సభలు ప్రదర్శనలు జరిపింది. హైదరాబాదులోనూ పెద్ద సదస్సు నిర్వహించారు. మీరు నాలుగు గ్రామాల్లో వ్యతిరేకత రెచ్చగొడితే మేము 4000 గ్రామాలను కదిలించి ఎదుర్కొంటామని హరీష్‌ రావు సవాల్‌ చేశారు. 123 కిందనే ఎక్కువ పరిహారం వస్తుందని ఆయన చేసిన వాదనను రైతు జెఎసి నాయకుడు మాజీ న్యాయమూర్తి చంద్ర కుమార్‌ తదితరులు తీవ్రంగా ప్రశ్నించారు. ఎట్టకేలకు హరీష్‌ రావు స్వరంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తుంది. 123 లేదా 2013 చట్టం దేని ప్రకారమైనా రైతులు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా పరిహారం ఇస్తామని ఇప్పుడు అంటున్నారు. వారు తమ శత్రువులు కాదని భరోసా ఇస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఒక సమస్య వుంది.2013 చట్టం ప్రకారం మార్కెట్‌ విలువకు నాలుగు రెట్టు ఇవ్వాలి.కాని భూమి రిజిస్ట్రేషన్‌ రేటును ఎనిమిదేళ్ల నుంచి సవరించకపోవడంతో బాగా తక్కువగా వుండిపోయింది. ఇప్పుడున్న ప్రకారం ఇస్తే రైతులకు పెద్దగా లాభం జరగదు. ముందు రేటును సవరించి తర్వాత పరిహరం నిర్ణయిస్తే తప్ప వారు సంతృప్తి చెందరు. రేపు ఫార్మా సిటీ వగైరాల కోసం మరో 12 వేల ఎకరాలు సేకరించడం మొదలు పెడితే మళ్లీ నిరసన రావచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.

దేవుడి పేరిట యాదగిరిలో మాత్రం..

ఇందుకు భిన్నంగా యాదగిరి ఆలయ అభివృద్దికి మాత్రం ప్రభుత్వం 10 వేల ఎకరాలు సేకరించగలిగింది. అది పట్టణ ప్రాంతం కావడం, దానికి తోడు దేవుడి కోసం అన్న సెంటిమెంటు కలసి వచ్చాయని టిఆర్‌ఎస్‌ నేత ఒకరన్నారు. అక్కడ ఎకరాకు అయిదు లక్షల వరకూ పరిహారం ఇచ్చారని సమాచారం. మల్లన్నసాగర్‌ దగ్గర కనీసం ఎనిమిది లక్షల వరకూఇవ్వాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఇక్కడ జరిగే పరిష్కారం రేపు మిగిలిన చోట్టకు కూడా మార్గదర్శకమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close