సినీ పరిశ్రమని విశాఖకి ఆహ్వానిస్తే అదీ తప్పే?

తెలంగాణా ఉద్యమ సమయంలో హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఎన్ని సమస్యలు, అవమానాలు ఎదుర్కొందో అందరికీ తెలుసు. అందుకు కారణం సినీ పరిశ్రమలో చాలా మంది ఆంధ్రాకు చెందినవారే కావడం. ఒకానొక సమయంలో సినీ పరిశ్రమని ఆంధ్రాలో విశాఖపట్నం లేదా మరొక చోటికి తరలిస్తే ఎలాగుంటుంది? అనే ఆలోచన కూడా చేసారు. కానీ అది చాలా భారీ వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం అయినందున, కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నపటికీ హైదరాబాద్ లోనే కొనసాగాలని నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా సినీ పరిశ్రమలో నెలకొని ఉన్న ఆ అభాద్రతాభావాన్ని ఇంకా పెంచిపోషించే విధంగానే వ్యవహరించింది తప్ప వారికి భరోసా కల్పించే ప్రయత్నాలేవీ చేయలేదు. సుమారు ఏడాదిన్నర గడిచిన తరువాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది కానీ నేటికీ సినీ పరిశ్రమలో ఇంకా అభద్రతా భావం నెలకొనే ఉంది. కానీ ఎవరూ ఆ విషయం బయటకి చెప్పుకొనే సాహసం చేయకపోయినా సినీ పరిశ్రమలో ప్రముఖులు తరచూ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలుసుకొంటూ ఆయనని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు చేయడం గమనిస్తే ఆ సంగతి అర్ధం అవుతుంది.

ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు విడిపోగానే తెలుగు సినీ పరిశ్రమ కూడా వెంటనే విడిపోవాలని తెలంగాణాకు చెందిన కొందరు సినీ ప్రముఖులు పట్టుబట్టారు. పట్టుబట్టడమే కాదు అందుకు ఏర్పాట్లు కూడా చేసుకొన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ సృజనాత్మక, కళా రంగానికి చెందిన సినీ పరిశ్రమను ఏవిధంగా రెండుగా విభజించవచ్చో ఎవరికీ స్పష్టత లేదు. పైగా రెండూ తెలుగు రాష్ట్రాలే కావడం చేత ఆంధ్రా సినిమా, తెలంగాణా సినిమా అని వేరేగా తీయవచ్చో లేదో వారికే తెలియాలి.

ఒకప్పుడు మద్రాస్ నుండి హైదరాబాద్ కి తెలుగు సినీ పరిశ్రమ తరలివచ్చింది. ఒకవేళ ఆంధ్రా సినీ పరిశ్రమ, తెలంగాణా సినీ పరిశ్రమ అనే వివక్ష చూపకుండా, వారిలో అభద్రతాభావం తొలగించగలిగినట్లయితే నేటికీ హైదరాబాద్ నుండి సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరావలసిన అవసరం లేదు. కానీ రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన ఆంద్రప్రదేశ్ లో కూడా సినీ పరిశ్రమ స్థాపించాలనుకోవడం తప్పు కాదు…నేరమూ కాదు. హైదరాబాద్ లో ఎటువంటి ఇబ్బందులు లేకపోతే అక్కడ యధాతధంగా తెలుగు సినీ పరిశ్రమను కొనసాగిస్తూనే అవసరం ఉన్నవాళ్ళు సినీ పరిశ్రమని విశాఖపట్నానికి కూడా వ్యాపింపజేయవచ్చును.

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విశాఖలో ఫిలిం కల్చరల్ సెంటర్ భవనానికి శంఖుస్థాపన చేసినప్పుడు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమ విశాఖ తరలి రావాలని కోరారు. ఆవిధంగా కోరడం తెలంగాణా సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కి తప్పుగా అనిపించింది. చంద్రబాబు నాయుడు బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి సినిమావాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసారని, వాళ్ళని విశాఖకు తరలిరావాలని కోరడం చాలా హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సినీ పరిశ్రమకి చెందినవారు చాలా మంది తెరాసలో కూడా ఉన్నారు. ఎన్నికల సమయంలో తెరాస వారిని కూడా వాడుకొంటుంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన విజయశాంతి తెరాస నుండి ఎందుకు బయటకు వెళ్ళవలసి వచ్చిందో అందరికీ తెలుసు.

తెలుగు సినీ పరిశ్రమని కేవలం ఆంధ్రాకి చెందిన పరిశ్రమగానే చూసి, ఉద్యమ సమయంలో వారిని భయబ్రాంతులను చేసిన సంగతి తలసాని మరిచిపోవచ్చును కానీ సినీ పరిశ్రమ ఎన్నటికీ మరచిపోదు. ఇంతకాలం సినీ పరిశ్రమని ఆంధ్రా సినీ పరిశ్రమగా మాత్రమే చూసిన తెరాస ప్రభుత్వానికి అది రాష్ట్రానికి బంగారు బాతు వంటిదని ఇప్పుడు గుర్తించినట్లు తలసాని మాటలతో అర్ధం అవుతోంది. అందుకే దానిని విశాఖ తరలిరమ్మని చంద్రబాబు నాయుడు పిలిస్తే ఆవిధంగా స్పందించారని భావించవలసి ఉంటుంది. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సినీ పరిశ్రమ ఏర్పడవలసిన అవసరం ఉందనే సత్యాన్ని తలసాని కూడా కాదనలేరు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు సినీ పరిశ్రమ తరలిపోకూడదనుకొంటే, అది హైదరాబాద్ లోనే నిశ్చింతగా తన కార్యక్రమాలు చేసుకొనేందుకు తెరాస ప్రభుత్వం దానికి అవసరమయిన సహకారం అందిస్తే చాలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close