మ‌రో మూడు రోజులుల్లో కూట‌మి అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌..!

తెలంగాణ‌లోని మ‌హా కూట‌మి పార్టీల మ‌ధ్య సీట్ల స‌ర్దుబాటు అంశం ఒక కొలీక్కి వ‌చ్చిన‌ట్టే అంటున్నారు కూట‌మి నేత‌లు. కూట‌మిపై ఎలాంటి అనుమానాలొద్ద‌ని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అన్ని పార్టీలూ భాగ‌స్వాములుగా ఉంటాయనీ, రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేది తామే అని ధీమా వ్య‌క్తం చేశారు. సీట్ల ద‌క్క‌ని కూట‌మి పార్టీల కీల‌క నేత‌ల‌కు నామినేటెడ్ ప‌ద‌వులు, ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రాధాన్య‌త ఉంటుంద‌న్నారు. కోదండ‌రామ్ నేతృత్వంలో ఉద్య‌మ ఆకాంక్ష‌ల క‌మిటీ ఏర్పాట‌వుతుంద‌నీ, తాము అధికారంలోకి వ‌చ్చాక ఈ క‌మిటీకి చ‌ట్ట‌బ‌ద్ధ‌త కూడా వ‌స్తుంద‌న్నారు.

సీట్ల కేటాయింపు విష‌యంలో సీపీఐ ప‌ట్టుబ‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీతో ఏఐసీసీ ఇన్ ఛార్జ్ స‌మావేశం కాగా, జ‌న స‌మితి పార్టీతో పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ స‌మావేశ‌మ‌య్యారు. సీట్ల స‌ర్దుబాటు విష‌య‌మై సీపీఐ, జ‌న స‌మితి పార్టీలు కొంత ప‌ట్టుద‌ల‌తో ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మావేశాల‌తో ఈ వ్య‌వ‌హారంపై స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌ని తెలుస్తోంది. జ‌న‌స‌మితికి ఇవ్వాల్సిన 8 సీట్ల‌పై ఈరోజు స్ప‌ష్ట‌త వ‌చ్చింద‌నే నేత‌లు చెబుతున్నారు. మిర్యాల‌గూడ‌పై జ‌న స‌మితి ఆస‌క్తి చూపిస్తోంది. కానీ, త‌న కుమారుడిని అక్క‌డి నుంచే బ‌రిలోకి దించాల‌ని జానారెడ్డి అనుకుంటున్నారు. అయితే, త‌న కుమారుడికి మిర్యాల‌గూడ సీటు ద‌క్క‌ని ప‌క్షంలో దాన్ని జ‌న‌స‌మితికి ఇవ్వ‌డానికి జానారెడ్డి ఒప్పుకున్నార‌ట‌. ఇక్క‌డ ఇంకో మెలిక ఏంటంటే… అక్క‌డ విజ‌యేంద‌ర్ రెడ్డి అనే జ‌న‌స‌మితికి చెందిన నేత‌కే టిక్కెట్ ఇవ్వాలంటున్నారు. ఇక‌, ఆసిఫా బాద్, స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క వ‌ర్గాల్లో స్నేహ‌పూర్వ‌క పోటీకి జన సమితి, కాంగ్రెస్ లు సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం.

ఇక‌, సీపీఐ విష‌యానికొస్తే ఒక్క సీటు కోస‌మే ఇంకా చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. బెల్లంప‌ల్లి, వైరా, హుస్నాబాద్ ల‌పై సీపీఐ స్పష్టంగానే ఉన్న‌ట్టు స‌మాచారం. కొత్త‌గూడెం త‌మ‌కు ఇవ్వాల‌న్న ప‌ట్టుద‌ల‌ను ఇంకా కొన‌సాగిస్తోంది. అయితే, ఇవాళ్ల సీపీఐ నేత‌ల‌తో భేటీలో… పార్టీ కంటే కూట‌మి ప్ర‌యోజ‌నాలు ముఖ్య‌మ‌నీ, ప్ర‌భుత్వం ఏర్పాటు త‌రువాత పార్టీల ప్ర‌యోజ‌నాల‌కు పెద్దపీట వేసుకుందామ‌నీ, కొంత స‌ర్దుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించాల‌ని నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. అయితే, దీనిపై అంతిమ నిర్ణ‌యాన్ని సీపీఐ నేత‌లు ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే, ఈ చ‌ర్చ‌లు సంతృప్తిక‌రంగానే సాగాయ‌ని కాంగ్రెస్‌, సీపీఐ నేత‌లు అంటున్నారు. మొత్తానికి, 14వ తేదీలోగా కూట‌మి పార్టీల అభ్య‌ర్థుల జాబితాలు కూడా ఒక కొలీక్కి వ‌చ్చాస్తాయ‌నే ఆశాభావం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close