కేశవరావు, సురేష్ రెడ్డి రాజ్యసభకి వెళ్తున్నారు

రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది అధికార పార్టీ తెరాస‌. మొద‌ట్నుంచీ వినిపిస్తున్న‌ట్టుగానే కే కేశ‌వ‌రావుకు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చారు ముఖ్య‌మంత్రి కేసీఆర్. ఆయ‌న‌తోపాటు మాజీ స్పీక‌ర్, సురేష్ రెడ్డికి అవ‌కాశం ఇచ్చారు సీఎం. నిజానికి, సురేష్ రెడ్డి పేరు కూడా మొద‌ట్లో వినిపించింది. ఎందుకంటే, ఎన్నిక‌ల ముందే ఆయ‌న తెరాస‌లో చేరారు. ఆ స‌మ‌యంలో ఎమ్మెల్యేగా టిక్కెట్ ఆశించినా, సామాజిక స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ఇవ్వ‌లేక‌పోయారు. అదే స‌మ‌యంలో… పార్టీలో ప్రాధాన్య‌త క‌ల్పిస్తామ‌నీ, మంచి ప‌ద‌వి ఇస్తాన‌ని కేసీఆర్ మాట ఇచ్చారని క‌థ‌నాలు వ‌చ్చాయి. అదే అంశాన్ని కొన్ని సంద‌ర్భాల్లో సురేష్ రెడ్డి కూడా ప్ర‌స్థావించారు. ఇప్పుడా మాట నిల‌బెట్టుకున్నార‌ని చెప్పొచ్చు. కేశవ‌రావు, సురేష్ రెడ్డి… ఈ ఇద్ద‌రూ రేపు నామినేష‌న్లు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నిక‌ల అనంత‌రం, సురేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా మండ‌లికి పంపిస్తార‌నే చ‌ర్చ జ‌రిగింది. అయితే, ఆయ‌నకి అసెంబ్లీ స్పీక‌ర్ గా ప‌నిచేసిన అనుభ‌వం ఉంది కాబ‌ట్టి, రాజ్య‌స‌భకి వెళ్తేనే బాగుంటుంద‌నే అభిప్రాయాన్ని ఆయ‌న కూడా ముఖ్య‌మంత్రికి వినిపించారు. అయితే, రాజ్య‌స‌భకు నోటిఫికేష‌న్ వ‌చ్చాక‌… ఇత‌ర ఆశావ‌హులు నిత్యం వార్త‌ల్లో నిలుస్తూ వ‌చ్చారుగానీ, సురేష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించలేదు.

కేశ‌వ‌రావు కొన‌సాగింపుపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వినిపించినా, ఆయన‌కి మ‌రో ఛాన్స్ ఇస్తున్నార‌ని రెండ్రోజుల కింద‌టే దాదాపు స్ప‌ష్ట‌మైపోయింది. కేకే స్థానంలో క‌విత‌ను పంపిస్తార‌ని కొన్నాళ్లు చ‌ర్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే, రెండో సీటు ఎవ‌రికి వ‌స్తుందా అనే ఉత్కంఠే చివ‌రి నిమిషం దాకా కొన‌సాగింది. మొద‌ట్నుంచీ రాజ్య‌స‌భ సీటు మీద చాలా ఆశ‌లు పెట్టుకున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి. చివ‌రి క్ష‌ణం వ‌ర‌కూ ఆయ‌న గ‌ట్టి ప్ర‌య‌త్న‌మే చేశారు. త‌న‌కు మ‌ద్ద‌తుగా ఎమ్మెల్యేల‌ను కూడా కూడ‌గ‌ట్టి మంత్రి కేటీఆర్ ని కలిశారు, గ‌డ‌చిన కొద్దిరోజులుగా అసెంబ్లీ ప్రాంగ‌ణంలోనే ఉంటూ వ‌చ్చారు. సామాజిక వ‌ర్గాల వారీగా చాలామంది నేత‌లు ఈ సీటు కోసం పోటీ ప‌డ్డారు. సీతారామ్ నాయ‌క్, హెటిరో కంపెనీ అధినేత పార్థ‌సార‌ధి రెడ్డి… ఇలా చాలామంది ప్ర‌య‌త్నించినా, అంతిమంగా ఈ ఇద్ద‌రి పేర్ల‌ను ముఖ్య‌మంత్రి ఖ‌రారు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మార్గదర్శిపై జగన్ ప్రచారాన్ని రోజా కూడా నమ్మలేదే !

మార్గదర్శి నిండా మునిగిపోయిందని చిట్స్ పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ రెడ్డి అండ్ సీఐడీ కంపెనీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. కోర్టుల్లో చెప్పారు.. కేసుల్లో...

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close