తలసాని రాజీనామాపై స్పందించిన స్పీకర్: ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం

హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ రాజీనామా వ్యవహారంపై తెలుగుదేశం తీసుకొచ్చిన ఒత్తిడి ఎట్టకేలకు ఫలించింది. స్పీకర్ మధుసూదనాచారి చివరికి స్పందించారు. రాజీనామా లేఖ తనదగ్గరే ఉందని, ఒకటి, రెండు రోజులలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ తమకు హామీ ఇచ్చినట్లు టీడీపీ నేతలు ఇవాళ తెలిపారు.

తలసాని వ్యవహారంపై తెలంగాణ తెలుగుదేశం నేతలు ఇటీవల ఒత్తిడిని బాగా పెంచిన సంగతి తెలిసిందే. రమణ, ఎర్రబెల్లి, రావుల చంద్రశేఖర్ రెడ్డివంటి తెలుగుదేశం నేతలు నిన్న గవర్నర్ నరసింహన్ వద్దకు వెళ్ళి తలసానిని బర్తరఫ్ చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అయితే విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను ఏమీ చేయలేనని గవర్నర్ బదులివ్వటంతో వారు రాజ్‌భవన్‌ముందు ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ వారు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి నివాసాన్ని ముట్టడించారు. మధుసూదనాచారి ముఖ్యనేతలను ఇంట్లోకి పిలిపించుకుని వారితో మాట్లాడారు. బయటకొచ్చిన తర్వాత ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ, సనత్‌నగర్‌లో తలసాని గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు. టీఆర్ఎస్‌లో చేరిన ఇతర టీడీపీ ఎమ్మెల్యేలుకూడా రాజీనామా చేయాలని డిమాండ్ చెేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం...

జగన్ అనుకుంటే అంతే.. ! ఎమ్మెల్సీ టిక్కెట్ ఆయన కుమారుడికి..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఇట్టే నిర్ణయం తీసుకుంటారు. దానికి ముందూ వెనుకా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దానికి తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపిక. రాజ్యసభకు...

వైసీపీలోనూ అలజడి రేపుతున్న రాపాక..!

జనసేన తరపున గెలిచి తాను వైసీపీ మనిషినని చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీలోనూ చిచ్చు పెడుతున్నారు. రాజోలు వైసీపీలో మూడు గ్రూపులున్నాయని.. అందులో తనది ఒకటని స్వయంగా...

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close