తెలంగాణ టెన్త్ విద్యార్థులంతా పాస్..!

తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు టెన్షన్ తీరిపోయింది. పరీక్షలు జరుగుతాయా లేదా అన్నదానిపై క్లారిటీ వచ్చేసింది. జరగవని ప్రభుత్వం ప్రకటించేసింది. అంత కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అందర్నీ పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకోవడం. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్‌లు ఖరారు చేసి.. పైతరగతులకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 5,34,903 మంది టెన్త్‌ విద్యార్థులు పరీక్షల బాధ లేకుండా… ఇంటర్మీడియట్ కోర్సుల్లో జాయిన్ కానున్నారు. డిగ్రీ, పీజీ పరీక్షలపై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.

కొన్ని పరీక్షలు జరిగిన తర్వాత.. హైకోర్టు నిలిపివేసిది. ఆ తర్వాత లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. రెండున్నర నెలలు గడిచిన తర్వాత .. లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నారు కానీ.. కరోనా కేసులు తగ్గడం లేదు. దీంతో.. హైకోర్టు..గ్రేటర్ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. కానీ ఇలా ఒక చోట కాదని..మరో చోట నిర్వహిస్తే.. సాంకేతిక సమస్యలు వస్తాయని భావించిన ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ప్రభుత్వం ఇలా.. పబ్లిక్ పరీక్షలను రద్దు చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా.. విద్యార్థులను పై తరగతులకు పంపింది.

ఈ విధానాన్ని అధ్యయనం చేసిన తెలంగాణ అధికారులు..చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో టెన్త్ విద్యార్థుల పాస్ శాతం.. 90 శాతం వరకూ ఉంటోంది. ఫెయిలయ్యేవారు పరిమితంగానే. అయితే గ్రేడ్లు, మార్కులు మాత్రమే..అందరికీ ప్రాధాన్యతాంశంగా మారింది. ఇప్పుడు ఇంటర్నల్ మార్కుల ద్వారానే గ్రేడ్లు ఇవ్వబోతున్నారు. దీని వల్ల బాగా చదివే వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితే ఏర్పడవచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close