జూన్ 2 తెలంగాణలో సంబురం – ఏపీలో నీరసం !

జూన్ 2 అంటే… రెండు తెలుగు రాష్ట్రాలకు ఒకటే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్తగా తెలంగాణ, ఏపీ ఏర్పడ్డాయి. ఏపీ పేరు మార్చలేదు కాబట్టి ఏపీలానే కొనసాగతోంది. అయితే.. విభజనతో అన్యాయం జరిగిపోయింది కాబట్టి.. తాము విభజనను కోరుకోలేదు కాబట్టి జూన్ 2ను.. ఆవిర్భావ దినోత్సవంగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అందుకే గత ప్రభుత్వం.. నవ నిర్మాణ దీక్షల పేరుతో.. కొత్త సంకల్పంతో ముందుకు వెళదామని ప్రజల్ని మోటివేట్ చేసేది. ఆ ప్రభుత్వం ఓడిపోయాక..జూన్ 2ను పట్టించుకునేవారే లేరు.

అదే తెలంగాణలో జూన్ రెండో తేదీన సంబరాలు చేసుకుంటున్నారు. గత పదేళ్లలో తాము చేసి చూపించిన అభివృద్ధి ని చూపిస్తూ అక్కడి ప్రభుత్వం భారీ ఎత్తున వేడుకలు చేస్తోంది. ప్రజల్లో ఓ రకమైన సెంటిమెంట్ ను పెంచడానికి ప్రయత్నిస్తోంది. వారి సంబరాలు చూస్తున్నారు కానీ ఏపీలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలకూ ప్లాన్ చేయలేదు. పాలకులు అంత తీరిక లేదు. వారు కేసులు.. బెయిల్స్.. అప్రూవర్స్ రాజకీయాల మధ్య నలిగిపోతున్నారు. జూన్ రెండు సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టిన చంద్రబాబు రాష్ట్ర దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మళ్లీ గెలిచి ఉంటే.. పోలవరం పూర్తయ్యేదని అమరావతి గ్రోత్ ఇంజెన్ గా మారి ఉండేదని బాధపడ్డారు.

అయితే చంద్రబాబు ఇలా అన్నారని వెంటనే ప్రెస్ మీట్ పెట్టిన పేర్ని నాని.. అసలు జూన్ 2తో మనకేమీ సంబంధం అని ఏపీ అవతరించింది నవంబర్ 1న అని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసింది జనార్దన్ రెడ్డి అని.. మరి చంద్రబాబు ఏం చేశాడని ప్రస్నించారు. 2047 కి పేదల్ని కోటీశ్వరులను చేస్తారట… అప్పటికి బాబు వయసు ఎంత అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు సంపద సృష్టించా అని చెప్తాడు .అసలు పొలాలు ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ప్లాట్లు ఇచ్చాడా…..అని ప్రశ్నించారు. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని చంద్రబాబు అధికారం లో ఉన్నప్పుడు కట్టచ్చుగా ….ఎందుకు కట్టలేదని అదే అమరావతిలో కూర్చుని ప్రశ్నించారు.

మొత్తంగా రాజకీయాల కోసం ఏపీ సర్వనాశనం అయిపోయింది. ఓ పార్టీ, వ్యక్తిపై ద్వేషంతో మొత్తంగా రాష్ట్రాన్ని నాకించేస్తున్నా.. కనీసం అడ్డు చెప్పలేని అవ్యవస్థ ఏపలో ఉండిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close