బై జీన్స్ టీడీపీ… బై చాన్స్ టీఆర్ఎస్..! ఆ అభ్యర్థుల పరిస్థితి ఏమిటి..?

2014 ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పదిహేను అసెంబ్లీ నియోజవకర్గాల్లో విజయం సాధించింది. వీరిలో పన్నెండు మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఒకరు కాంగ్రెస్‌లో చేరారు. కృష్ణయ్య అసెంబ్లీ రద్దయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అంటే.. పదిహేను మందిలో నికరంగా.. ఒక్క సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాత్రమే మిగిలారు. గ్రేటర్‌ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్‌లో చేరిపోయారు. టీఆర్ఎస్‌లో వీరి పరిస్థితి ఎలా ఉంది..? వారిని టీఆర్ఎస్ నేతలుగా చూస్తున్నారా..?. వారికి పార్టీ తరపున సహకారం అందుతోందా..? అంటే.. లేదనే చెప్పాలి. అందరూ.. టీఆర్ఎస్‌లో ద్వితీయశ్రేణి నేతలుగా మిగిలిపోయారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

టీడీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచి.. ఈ సారి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న వారు.. సంప్రదాయ టీఆర్ఎస్ క్యాడర్ నుంచి.. వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. శేరిలింగం పల్లిలో.. కార్పొరేట్లు ఎవరూ అరికెపూడి గాంధీకి సహకరించడం లేదు. ఆయన వెంట టీడీపీ క్యాడర్ కూడా పెద్దగా లేదు. ఇక కూకట్ పల్లిలో.. మాధవరం కృష్ణారావును వ్యతిరేకిస్తూ.. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన… గొట్టిముక్కల పద్మారావు ఏకంగా పార్టీకి రాజీనామా చేసేశారు. గత ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఇక జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో.. కేటీఆర్ సన్నిహితుడైన సతీష్ రెడ్డి రేపిన అలజడిలో… మాగంటి గోపీనాథ్‌నే.. కేటీఆర్ మందలించారు. సతీష్ రెడ్డి.. గతంలో జూబ్లిహిల్స్ ఇన్చార్జ్ గా ఉండేవారు. ఓ సెటిల్మెంట్ కేసులో ఒడిషా జైలుకు వెళ్లారని.. ఆ కేసుతో కేటీఆర్‌కు సంబంధం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు పార్టీలో పోటీ విషయానికి వచ్చే సరికి.. మాగంటి గోపీనాథ్‌కు.. కేటీఆర్ చివాట్లు తప్పలేదు. ఇక రాజేంద్రనగర్ నియోజకవర్గంలో… ప్రకాష్ గౌడ్‌ను టీఆర్ఎస్‌ జమ్మీని చేసిందనేప్రచారం జరుగుతోంది.

అక్కడ టీఆర్ఎస్ తరపున ఓ బలమైన రెబల్ క్యాండిడేట్ ఉన్నారు. ఆయనకు టీఆర్ఎస్ క్యాడర్ సహకరిస్తోంది. ప్రకాష్ గౌడ్ మాత్రం.. తన సొంత అనుచరవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ మజ్లిస్ కోసమే.. టీఆర్ఎస్ రెబల్‌ను బరిలోకి నిలబెట్టిందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎక్కడా మజ్లిస్ పోటీ చేయడం లేదు.. ఎనిమిది స్థానాల్లో తప్ప. దీంతో ప్రకాష్ గౌడ్ భవితవ్యం… చిక్కులో పడిపోయింది. గ్రేటర్ పరిధిలోనే కాదు.. పాలకుర్తి, పరకాల నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, చల్లా ధర్మారెడ్డిలకూ.. టీఆర్ఎస్ పాత క్యాడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ఏ విధంగా చూసినా.. టీడీపీ నుంచి గెలిచి.. టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన వారిలో లక్ బై చాన్స్ ఒకరిద్దరు బయటపడతారేమో కానీ.. మిగతా వాళ్లను.. టీఆర్ఎస్ నేతలే ఓడిస్తారని ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత..?

తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలపై కన్నేసిన బీజేపీ ప్రచారంలో వెనకబడిన అభ్యర్థులను మార్చాలని నిర్ణయం తీసుకోనుందా..? సర్వేలతో ఎప్పటికప్పుడు రాష్ట్రంలో పరిస్థితిని తెలుసుకుంటున్న జాతీయ నాయకత్వం పెద్దపల్లి లోక్ సభ అభ్యర్థిని మార్చనుందా..?...

మూడు రోజులు బయటకు రాకండి… వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. రానున్న మరో మూడు రోజులపాటు 3 నుంచి 5 డిగ్రీల సెంటిగ్రేడ్ ల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ...

నా కొడుకును ఉరి తీయండి… మాజీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లోనే సంచ‌ల‌నం సృష్టిస్తున్న బీఆర్ఎస్ నేత‌, మాజీ ఎమ్మెల్యే ష‌కీల్ కొడుకు హిట్ అండ్ ర‌న్ కేసుల‌పై ష‌కీల్ స్పందించారు. ఓ కేసులో బెయిల్ రాగానే మ‌రో కేసు తెర‌పైకి తీసుక‌రావ‌టం వెనుక...

నగరి రివ్యూ : రోజాకు ఏడుపొక్కటే మిగిలింది !

ఆంధ్రప్రదేశ్ లోని సెలబ్రిటీ నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం. టీడీపీ కంచుకోట లాంటి నియోజకవర్గంలో రెండు సార్లు రోజా గెలిచారు. మరి ఈ సారి గెలుస్తారా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close