సేవ‌ చేయ‌డం కోస‌మే ఫిరాయింపులంటున్న త‌ల‌సాని!

కొబ్బ‌రిచెట్టు ఎందుకు ఎక్కావురా అని వెన‌క‌టికి ఒక‌డ్ని నిల‌దీస్తే… దూడ గ‌డ్డి కోసం అన్నాడ‌ట‌! కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను తెరాస‌లోకి ఆక‌ర్షిస్తున్న తీరుపై మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ చెప్పిన మాట కూడా అచ్చంగా ఇలానే అనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం మీద గెలిచిన ఎమ్మెల్యేల‌కే న‌మ్మ‌కం పోయింద‌నీ, అందుకే పార్టీకి దూరంగా ఉండాల‌ని చూస్తున్నార‌ని త‌ల‌సాని చెప్పారు. 2004 త‌రువాత తెరాస ఎమ్మెల్యేల‌ను కాంగ్రెస్ లోకి తీసుకున్నార‌నీ, అదెక్క‌డి ప్ర‌జాస్వామ్య‌మని ప్ర‌శ్నించారు. ఇప్పుడు ఫిరాయింపుల‌పై మాట్లాడుతున్న దద్ద‌మ్మ‌లే అప్పుడూ ఉన్నార‌ని త‌ల‌సాని ఎద్దేవా చేశారు. ఈ ప‌నికిరాని, చేత‌గాని దద్ద‌మ్మ‌లు.. ఆరోజు పార్టీ ఫిరాయింపులు త‌ప్ప‌నీ, తెరాస వారిని చేర్చుకోవ‌డం త‌ప్పిద‌మ‌ని ఎందుకు మాట్లాడ‌లేదు ద‌ద్ద‌మ్మలారా అని ప్ర‌శ్నించారు..? మీకు చేత‌నైతే రాష్ట్రంలో తిర‌గండి ప‌నికిమాలిన చేత‌గాని ద‌ద్ద‌మ్మ‌లారా… అంటూ ప‌దేప‌దే తిడుతూ మాట్లాడారు!

రాజ్యాంగ‌మంటే వీళ్ల ఇంట్లోనే పుట్టిన‌ట్టు, గాంధీ భ‌వ‌న్ లోనే పుట్టిన‌ట్టు, వేరేవాళ్ల‌కు తెల్వ‌న‌ట్టు మాట్లాడుతున్నార‌ని కాంగ్రెస్ పై త‌ల‌సాని విమ‌ర్శ‌లు చేశారు. కొత్త‌గా పార్టీలో చేరిన ఎమ్మెల్యేల‌తోనే తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న‌ట్టుగా కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌న్నారు. సేవ చేయాలంటే, తెరాస‌లో ఉంటేనే చెయ్యొచ్చు అనే న‌మ్మ‌కంతోనే… ఒక విశాల‌మైన దృక్ప‌థంతో వ‌స్తున్నారే త‌ప్ప‌… డ‌బ్బుల కోస‌మో ప‌ద‌వుల ‌కోస‌మో కాద‌ని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ చెప్ప‌డం జరిగింది! సేవ అంటే ఈ ప్ర‌భుత్వం వ‌ల్ల‌, కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌ల్ల మాత్ర‌మే జ‌రుగుతుంద‌న్న విశ్వాసంతో వ‌స్తున్నార‌ని చెప్పారు!

జంప్ జిలానీల‌కు ఇంత‌టి విశాల దృక్ప‌థం ఉంటుంద‌ని మంత్రి త‌ల‌సాని చెబుతుంటే హాస్యాస్ప‌దంగా ఉంది! అందుకే, తెరాస విశాల హృద‌యంతో అంద‌ర్నీ అక్కున చేర్చుకుంటోంద‌న్న‌మాట‌! అలాంట‌ప్పుడు, సీఎల్పీ విలీనం కోసం తెరాస ఎందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది? ఇందులో ఉన్న ప్ర‌జాసేవా కోణం ఏంట‌బ్బా..? అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మంటూ లేకుండా చేయాల‌నే ల‌క్ష్యంతో ఎందుకు ప‌నిచేస్తోంది..? డ‌బ్బూ ప‌ద‌వీ ఆశించకుండా ప్ర‌జ‌ల ప‌ట్ల అత్యంత ప్రేమాభిమానాల‌తో బాధ్య‌త‌తో సేవ చేసుకునేందుకు పార్టీ మారుతున్న సద‌రు నాయ‌కుల‌తో రాజీనామాలు ఎందుకు చేయించ‌డం లేదు? వారిపై స్పీక‌ర్ ఎందుకు అన‌ర్హ‌త వేటు వేయ‌డం లేదు? ఒక‌ప‌క్క ఫిరాయింపుల్ని నిర్ల‌జ్జ‌గా నీతిబాహ్యంగా ప్రోత్స‌హిస్తూ, చ‌ట్టస‌భ‌లో ప్ర‌తిప‌క్షం కూడా ఉండాల‌నే ప్ర‌జాస్వామ్య నియ‌మాల‌కు తూట్లు పొడుస్తూ… మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యం గురించి త‌ల‌సాని లాంటివాళ్లు లెక్చ‌ర్లు ఇస్తుంటే… స‌గ‌టు పౌరుడికి ఎలా అనిపిస్తుంది..? రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన ఈ తెరాస నాయ‌కులు చేస్తున్న సేవ ఏదీ..? రెవెన్యూ, పంచాయ‌తీ, ఇంట‌ర్ బోర్డు… ఇలా ఒక్కో వ్య‌వ‌స్థా భ్ర‌ష్టుప‌ట్టిపోయిందంటే ఎవ‌రి సేవల ఫ‌లితం ఇది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close